Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్లోకి ఐదుగురు క్రేజీ కంటెస్టెంట్స్... హింట్ ఇచ్చేసిన నాగార్జున!

Published : Oct 01, 2023, 06:10 PM IST
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్లోకి ఐదుగురు క్రేజీ కంటెస్టెంట్స్... హింట్ ఇచ్చేసిన నాగార్జున!

సారాంశం

బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు అనేది చాలా కామన్. అత్యధికంగా ఒకరిద్దరిని హౌస్లోకి పంపుతారు. ఈసారి 5 వైల్డ్ కార్ట్ ఎంట్రీలు ఉంటాయని తెలుస్తుంది.   

గత ఆరు సీజన్లో ఎన్నడూ లేని విధంగా కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో మొదలైంది. సాధారణంగా 19 నుండి 21 మంది కంటెస్టెంట్స్ తో షో లాంచ్ చేస్తారు. సీజన్ 7లో వివిధ కారణాలతో అతి తక్కువ మంది హౌస్లోకి వెళ్లారు. వీరిలో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని మూడు వారాల్లో ఇంటిని వీడారు. ఇక నాలుగో వారం రతికా రోజ్ ఎలిమినేట్ కానుందనే ప్రచారం జరుగుతుంది. ఆమె బయటకు వెళ్లిపోయిన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, తేజా, శోభా శెట్టి, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, శివాజీ, సందీప్, ప్రియాంక ఉంటారు. 

ఈ క్రమంలో ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, భోలే షామిలి, అంజలి పవన్, నాయని పావని ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారనేది తాజా సమాచారం. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనిది ఈసారి జరగబోతుంది అన్నాడు. ఆయన చెప్పింది వైల్డ్ కార్డు ఎంట్రీస్ గురించే అని సోషల్ మీడియా టాక్. 

వీరందరూ దాదాపు సీరియల్ నటులే. నిజంగా వీరు హౌస్లోకి వెళితే సీరియల్ బ్యాచ్ శక్తి పెరిగే అవకాశం ఉంది. ప్రతి సీజన్ కి హౌస్లో రెండు మూడు గ్రూప్ లు ఏర్పడతాయి. ఈసారి సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ గా హౌస్ నడిచే అవకాశం ఉంది. ఆల్రెడీ శివాజీ తన వ్యతిరేకత వాళ్లపై ప్రకటించాడు. శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో తన గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక చూడాలి ఏం జరగనుందో... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా