Bigg Boss Telugu 7: సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ... ఏకంగా హోస్ట్ ని నిలదీశాడు, నాగ్ ఏం తేల్చాడు!

Published : Oct 01, 2023, 05:13 PM ISTUpdated : Oct 01, 2023, 05:22 PM IST
Bigg Boss Telugu 7: సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ... ఏకంగా హోస్ట్ ని నిలదీశాడు, నాగ్ ఏం తేల్చాడు!

సారాంశం

శనివారం ఎపిసోడ్లో నాగార్జున శివాజీని తప్పుబట్టారు. అలాగే శివాజీ నుండి పవర్ అస్త్ర తీసుకున్నాడు. అయితే ఆదివారం ఎపిసోడ్లో శివాజీ ప్రశ్నించాడు. తాను తప్పు చేసినట్లు ఆధారాలు లేవన్నాడు. 

శనివారం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని రఫ్ ఆడించేశాడు. తప్పొప్పులు సరిదిద్దుతూ ఎపిసోడ్ సాగింది. ఈ క్రమంలో కొందరిని హెచ్చరించారు. మరికొందరికి శిక్షలు కూడా పడ్డాయి.  నామినేషన్స్ ప్రక్రియకు శివాజీ, శోభా శెట్టి, సందీప్ లను బిగ్ బాస్ జ్యూరీ సభ్యులుగా పెట్టాడు. ఒకరిని నామినేట్ చేయడానికి మరొక కంటెస్టెంట్ చెప్పే కారణాలతో వీరు ఏకీభవించాలి. లేదంటే ఆ నామినేషన్ చెల్లదు. జ్యూరీ సభ్యుల నిర్ణయాలను కొందరు వ్యతిరేకించారు. మొత్తంగా ప్రిన్స్ యావర్, గౌతమ్, తేజా, రతికా రోజ్, శుభశ్రీ, ప్రియాంక, తేజా నామినేట్ అయ్యారు. 

నామినేషన్స్ లో ఉన్న ఆరుగురితో పాటు పల్లవి ప్రశాంత్ ని ఒక్కొక్కరిగా సీక్రెట్ రూమ్ కి పిలిచిన నాగార్జున జ్యూరీ సభ్యులలో ఎవరు పక్షపాతంగా వ్యవహరించారో చెప్పాలని అన్నారు. ముగ్గురు శివాజీ పేరు చెప్పగా, మరో ముగ్గురు సందీప్ పేరు చెప్పారు. తేజా ఎవరి పేరు చెప్పలేదు. శివాజీ, సందీప్ లకు చెరో మూడు వ్యతిరేక ఓట్లు వచ్చిన నేపథ్యంలో శోభా శెట్టి ఒపీనియన్ అడిగాడు నాగార్జున. వారిద్దరిలో పక్షపాతంగా ఎవరున్నారని అడిగాడు. దాంతో ఆమె శివాజీ పేరు చెప్పింది. ఈ కారణంగా శివాజీ పవర్ అస్త్రతో పాటు దాని వలన వచ్చిన బెనిఫిట్స్ కోల్పోయాడు. 

ఆదివారం ఎపిసోడ్లో శివాజీ ఈ విషయం లేవనెత్తాడు. నేను పక్షపాతంగా ఉన్నట్లు ఆధారాలు లేవు. నాకు అన్యాయం జరిగింది అన్నట్లు మాట్లాడాడు. దాంతో నాగార్జున శోభా శెట్టిని అడిగారు. నీకు ఏ కారణంగా శివాజీ పక్షపాతంగా వ్యవహరించాడని అనిపించింది అని అడిగాడు. శోభా శెట్టి సరైన ఆన్సర్ ఇవ్వలేదు. నాగార్జున ఆమె శివాజీ గురించి తప్పుగా చెప్పినట్లు తీర్పు చెప్పాడు. కాగా మొదటి నుండి శివాజీ సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టిలకు వ్యతిరేకం. రానున్న కాలంలో వారితో శివాజీ యుద్ధం గట్టిగా ఉందనిపిస్తుంది. 

 ఈ గొడవ పక్కన పెడితే సండే నాగార్జున కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించారు. ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించిన నాగార్జున 'బొమ్మ గీయి గెస్ చేయి' అనే గేమ్ పెట్టాడు. టీమ్ నుండి ఒక సభ్యుడు వచ్చి బౌల్ లో ఉన్న పేపర్ రోల్ తీయాలి. ఆ పేపర్ మీద రాసి ఉన్న సినిమా టైటిల్ ని బొమ్మగా వేయాలి. తమ టీమ్ సభ్యులు గుర్తించాలి. ఈ గేమ్ సరదాగా నడిచింది. సినిమా టైటిల్స్ ని బొమ్మల్లో చెప్పలేక, వాటిని గెస్ చేయలేక ఇరు టీమ్ సభ్యులు తికమకపడ్డారు. 

ఇక నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, రతికార్ రోజ్, టేస్టీ తేజాలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఈ వారం రతికా రోజ్ ఎలిమినేట్ అంటూ సమాచారం అందుతుంది. నామినేటైన వారిలో రతికా రోజ్, తేజాలకు తక్కువ ఓట్లు వచ్చాయక. తేజా కంటే కూడా రతికా రోజ్ ఓటింగ్ లో వెనుకబడిన నేపథ్యంలో ఆమె ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. నేటి ఎలిమినేషన్ తో కేవలం 10 మంది ఇంటి సభ్యులు మిగులుతారు. ఈ క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీలో పెద్ద మొత్తంలో ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా