
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యారు. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వీకెండ్ గ్రాండ్ గా ముగించింది. లాంగ్ వీకెండ్ తో పాటు పండగ సెలవులు కలిసి వచ్చాయి. ఇక ఐదు రోజులకు గానూ గాడ్ ఫాదర్ రూ. 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలో చూశారు.
ఈ విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ చిత్రాన్ని రజినీకాంత్ చూడడంతో ఆయన ఉబ్బితబ్బిబవుతున్నారు. అలాగే సినిమాపై రజినీ ప్రశంసలు కురిపించినట్లు తన ట్వీట్ లో పొందుపరిచారు. లూసిఫర్ రీమేక్ తీర్చిద్దిన తీరు బాగుంది. మూవీ ఎక్స్లెంట్, నైస్, ఇంట్రెస్టింగ్ అని రజినీకాంత్ అన్నారు. మా సినిమాను మీ ప్రశంసించడం గొప్ప విషయం. ధన్యవాదాలు సార్ అంటూ... మోహన్ రాజా ట్వీట్ చేశారు.
ఇక ఏపీ/తెలంగాణా కలిపి ఐదు రోజులకు గాడ్ ఫాదర్ దాదాపు రూ. 37 కోట్ల షేర్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ డెబ్భై కోట్లకు పైగా ప్రీ బిజినెస్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 91 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. కాబట్టి గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా యాభై శాతం కలెక్షన్స్ రావాలి. వాస్తవంగా చెప్పాలంటే సినిమాకు వచ్చిన టాక్ రేంజ్లో వసూళ్లు లేవు. అయితే వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. చెప్పుకోదగ్గ డ్రాప్ లేదు.
సోమవారం నుండి గాడ్ ఫాదర్ కి అసలు పరీక్ష మొదలు కానుంది. వీక్ డేస్ లో సత్తా చాటితే మాత్రమే గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ చేరుకోగలదు. ఓవర్సీస్ లో పరిస్థితి బాగానే ఉంది. సల్మాన్ నటించినప్పటికీ హిందీలో చెప్పుకోదగ్గ ఆదరణ దక్కడం లేదు. హిందీ తెలుగు వర్షన్స్ కలిపి నార్త్ ఇండియాలో రూ.6.5 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. గాడ్ ఫాదర్ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. సత్యదేవ్, నయనతార కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం అందించారు.