రకుల్ బర్త్ డే... అతిలోక సుందరి అంటూ ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్!

Published : Oct 10, 2022, 06:47 PM IST
రకుల్ బర్త్ డే... అతిలోక సుందరి అంటూ ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్!

సారాంశం

స్టార్ లేడీ రకుల్ ప్రీత్ బర్త్ డే నేడు. ఆమె బర్త్ డే వేడుకలు ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా అతిలోక సుందరి అంటూ ట్రెండ్ చేస్తున్నారు.   

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు నేడు. 1990 అక్టోబర్ 10న జన్మించిన రకుల్ నేడు 32వ ఏట అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో రకుల్ బర్త్ డే అభిమానులు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. రకుల్ ని అతిలోక సుందరి అంటూ ట్రెండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీదేవి నిక్ నేమ్ రకుల్ కి వాడేశారు ఫ్యాన్స్. ఆమెను అతిలోక సుందరిగా అభివర్ణిస్తున్నారు. ట్విట్టర్ లో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. 

కాగా గత ఏడాది రకుల్ ఇదే రోజు తన ప్రియుడంటూ జాకీ భగ్నానీని పరిచయం చేశారు. ప్రేమను ప్రకటించిన రకుల్ ఆయన్ని వివాహం ఎప్పుడు చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జాకీ బాలీవుడ్ లో నిర్మాత,నటుడిగా ఉన్నారు. ఇటీవల పలు సందర్భాల్లో రకుల్ కి పెళ్లి ప్రశ్న ఎదురైంది. జాకీతో పెళ్లి ఎప్పుడని పదే పదే అడగడంతో ఆమె కొంత అసహనానికి గురయ్యారు. ఆ సమయం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెబుతామని రకుల్ చెప్పడం విశేషం. 

ఇక టాలీవుడ్ లో ఫేడ్ అవుటైన రకుల్ బాలీవుడ్లో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఆమె నటించిన అటాక్, రన్ వే 34, కట్ పుట్లి వరుసగా విడుదలయ్యాయి. అయితే ఒక్క చిత్రం కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. మరో రెండు హిందీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 తిరిగి ప్రారంభమైంది. కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ సెకండ్ హీరోయిన్ అని సమాచారం. రకుల్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ గా భారతీయుడు 2 చెప్పవచ్చు. 

తెలుగులో స్టార్ డమ్ అనుభవించిన రకుల్ పవన్, ప్రభాస్ లను మినహాయిస్తే దాదాపు అందరు స్టార్ హీరోలతో చేశారు. తెలుగులో ఆమె నటించిన చివరి మూవీ కొండపొలం. వైష్ణవ్ తేజ్ నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

PREV
click me!

Recommended Stories

హీరోకి రూ.110 కోట్లు, హీరోయిన్ కి రూ.2 కోట్లు.. ఏమాత్రం సంబంధం లేని రెమ్యునరేషన్స్ వైరల్
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవిగో