`జైలర్` సినిమాతో తన రేంజ్ ఏంటో ఇండస్ట్రీకి, బాక్సాఫీసుకి చూపించాడు రజనీకాంత్. ఇప్పుడు ఓ సాహసోపేతమైన కథతో `వేట్టయన్` సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అది ఎలా ఉందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` సినిమాతో బాక్సాఫీసు దుమ్ముదులిపేశాడు. తన రేంజ్ ఏంటో బాక్సాఫీసుకి చూపించాడు. ఇప్పుడు `వేట్టయన్` సినిమాతో వస్తున్నాడు రజనీకాంత్. `జై భీమ్` ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా కావడం విశేషం. ఈ మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాత. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ పాజిల్ ముఖ్య పాత్రల్లో నటించారు. రానాది నెగటివ్ రోల్ అని తెలుస్తుంది. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
undefined
రజనీకాంత్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో సైలెంట్‌గా సోషల్ మీడియాలో విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం యాక్షన్ తో ఈ సినిమా సాగింది. పోలీస్ డిపార్ట్ మెంట్‌కి, ఓ కార్పొరేట్‌కి మధ్య జరిగే గొడవగా ఈ మూవీ సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాదు పోలీసు వ్యవస్థలోని లొసుగులను క్రైమ్ విషయంలో పోలీసులు ఏం చేస్తారనేది ఓ కొత్త కోణంలో చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్.. `జై భీమ్` సినిమాతో పోలీసులు అమాయకులను ఎలా బలి చేస్తారు, కేసుల్లో ఎలా ఇరికిస్తారో చూపించారు. దానిపై హీరో పోరాడటాన్ని చూపించారు. ఇందులోనూ ఓ పెద్డోడిని ఎలా ఎదుర్కొంటారు, క్రైమ్ విషయంలో వాళ్లు ఎలా స్ట్రగుల్ అవుతారు, డిపార్ట్ మెంట్‌లో ఉండే ప్రెజర్ ఏంటి, ఎన్‌కౌంటర్ ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు. దాని వెనకాల ఏం జరుగుతుందనేది `వేట్టయన్` సినిమాలో చూపిస్తున్నట్టుగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
ఇక ట్రైలర్ ఎలా ఉందనేది చూస్తే, ఖైదు చేయ్ చైదు చేయి నేరస్తుడిని ఖైదు చేయ్ అనే నినాదాలతో ట్రైలర్ ప్రారంభమైంది. `ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ, పోరంబోకులకు బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలను ఎన్‌కౌంటర్‌లో చంపేయాలి` అని ట్రైలర్‌లో వినిపించే డైలాగులతో అక్కడ జరిగిన విషయమేంటో సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది. `నేరస్తుడిని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. ఇట్ వాజ్ ఎ బ్రూటల్ మర్డర్ సార్. ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఏదీ ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్లిపోండయ్యా..` వంటి డైలాగ్‌లతో పోలీస్ డిపార్ట్ మెంట్‌లో జరిగే సంఘటనలను ప్రతిబింబిస్తుంది.
అనంతరం.. ` వారంలో ఎన్‌కౌంటర్ జరిగిపోవాలని రావు రమేష్ మాటలకు, అక్కర్లేదు సార్. వారం రోజులు అక్కర్లేదు. మూడే రోజుల్లో డిపార్ట్ మెంట్‌కి మంచి పేరొస్తుంది అంటూ సమాధానం చెబుతూ ఎంట్రీ ఇస్తారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆయన స్టైలిష్ నడక, హుందాతనం చూస్తే, వేట్టయన్ టైటిల్‌కి తగ్గ కటౌట్‌గా అనిపించింది. తనదైన స్టయిలీష్ నడకతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు రజనీకాంత్. అనంతరం జస్టిస్ డినైడ్ అంటూ.. కారులో వెళ్తూ కనిపిస్తారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు అంటూ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చేస్తారు యాంగ్రీ యంగ్ మ్యాన్ రానా. దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూలేం లేదు. కొంచెం బుర్రుంటే చాలు.. అంటూ వైవిధ్యమైన కేరక్టర్‌తో పరిచయమయ్యారు ఫాహద్ ఫాజిల్. ఇలా మెయిన్ కాస్టింగ్‌ని పరిచయం చేశారు.
ఆ తర్వాత `క్రైమ్ కేన్సర్ లాంటిది. దానికి పెరగనివ్వకూడదు. సార్ తన దగ్గర లాయర్ల సైన్యమే ఉంది. వాడి నెట్‌వర్క్ లో రెండు వేల మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్నీ ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. ఊరికే మాట్లాడి ప్రయోజనం లేదు. వాడిని లేపేద్దాం. గాట్ ఇట్. యస్ సార్.. ` అని పోలీసులు చెబుతుండగా, అమితాబ్ మళ్లీ ఎంట్రీ ఇస్తూ, న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయంతోనే సెట్ చేయాలి. అంతేగానీ, ఇంకో అన్యాయంతో కాదు అని అమితాబ్ చెప్పిన డైలాగ్‌ని బట్టి, ఆయన కేరక్టర్ మీద ఓ అవగాహనకు వచ్చేయొచ్చు. `అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండేకన్నా, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు జడ్జిసార్ ` అంటూ అమితాబ్ ముందు నిలుచున్న వేట్టయన్‌ని చూసిన ఎవరికైనా వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది.
దీనికి కౌంటర్‌గా రజనీ రియాక్ట్ అవుతూ, నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్ వాడినే సార్. నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్లా కాదు` అని చెప్పడం హైప్ ఇస్తుంది. ఇది రెగ్యూలర్ రజనీకాంత్ మాస్, యాక్షన్ మూవీలా లేదు. కంటెంట్ ఓరియెంటెడ్‌గా ఉంది. బలమైన విషయాన్ని ఇందులో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది సూపర్ స్టార్‌ని ఓ కొత్త తరహాలో ఆవిష్కరించబోతుందని తెలుస్తుంది. మరో రకంగా ఆయన సాహం చేస్తున్నారనే చెప్పాలి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రజనీకి జోడీగా మంజు వారియర్ నటిస్తుంది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.