రోజు రోజుకి చంద్రబాబు నాయుడికి మద్దతు పెరుగుతుంది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నారు. చంద్రబాబుని జైల్లో మూలాఖత్ కోసం రజనీకాంత్ వస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయనకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. రాజకీయ నాయకులు కలిసి మద్దతు తెలియజేస్తున్నారు. సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన జనసేనపార్టీ తరఫున చంద్రబాబు నాయుడిని కలిసి తమ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు.
ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్.. సైతం చంద్రబాబుని కలిసేందుకు(ములాఖత్) వస్తున్నారు. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుని కలవబోతున్నారు. దీంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖుల నుంచి చంద్రబాబుకి సపోర్ట్ పెరుగుతుంది. క్రెడిట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ వస్తున్నారంటే అది మరింత పెరిగే అవకాశం ఉంది. రాజకీయంగా అది వైసీపీ ప్రభుత్వానికి నెగటివ్‌గా మారే అవకాశం ఉంది. చంద్రబాబు మైలేజ్ పెరిగే అవకాశాలున్నాయి.