రాక్ స్టార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ యూకేలో లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ కన్సర్ట్ కు పాల్గొనబోతున్నారు. ఇంతకీ ఈవెంట్ ఎప్పుడనే డిటేయిల్స్ ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) గురించి, ఆయన సంగీతం గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. 1999లోని ‘దేవి’ చిత్రంతో మొదలై ఇప్పటి వరకు 100 సినిమాలకు పైగా మ్యూజిక్ అందించారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి సంగీత ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అంతేకాకుండా తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకోవడం విశేషం.
2021లో దేవీశ్రీ ‘పుష్ప : ది రైజ్’ కు అందించిన మ్యూజిక్ ఎంతలా ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా సమంత స్పెషల్ డాన్స్ లో కనిపించిన Oo Antava సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ‘శ్రీవల్లి’ సాంగ్ కూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ‘పుష్పకు ఉత్తమ సంగీతం అందించిన దేవీకి నేషనల్ అవార్డు కూడా వరించింది. ఇదిలా ఉంటే.. భారీ చిత్రాలతో ఆయా చిత్రాలకూ సంగీతం అందిస్తున్న దేవీశ్రీ అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ వేదికలుగా లైవ్ పెర్ఫామెన్స్ లు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు.
undefined
ఇక తాజాగా Dsp Oo Antawa Tour UK అంటూ లండన్ లో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించబోతున్నారు. రెయిన్‌బౌస్కీ(Rain bowsky) అనే సంస్థ ఈ ఈవెంట్‌ని భారీగా నిర్వహిస్తుండటం విశేషం. లండన్ లోని ఓవో అరెనా వెంబ్లే స్టేడియంలో రెండు రోజులు కచేరీని ప్లాన్ చేశారు. 2024 జనవరి 13న తెలుగులో, ఆ మరుసటి రోజు 14న తమిళంలో మ్యూజిక్ కన్సర్ట్ జరగనుందని వెల్లడించారు. కచెరీలకు వెళ్లాలంటే టికెట్స్ కూడా బుక్ చేసుకునేందుకు లింక్స్ ను ఇచ్చారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని రెయిన్‌బౌస్కీ సంస్థ గ్రాండ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తుందని నిర్వాహలు తెలిపారు.