
సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తి చేసిన 50 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. అనేక పాత్రలతో అనేక భాషల్లో ప్రేక్షకులను మెప్పించిన రజనీకాంత్, ఈ అరుదైన మైలురాయిని అధిగమించిన సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రజనీకాంత్‌కు సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’ లో శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు ట్వీట్‌లో ఆయన పేర్కొన్న ప్రకారం:
"సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనే కాదు, ఆయన సినిమాలు కూడా సమాజంపై ప్రభావం చూపించాయి. ఆయన్ని చూసి లక్షల మంది స్పూర్తి పొందారు." అని చంద్రబాబు రాసుకొచ్చారు.
సీఎం చంద్రబాబు చేసిన ఈ అభినందనలపై రజనీకాంత్ స్పందించారు. ఆయన మాటలు తన మనసును తాకాయని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తలైవా కూడా స్పెసల్ పోస్ట్ పెట్టారు.
రజనీ ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు:
"గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నా మనసును తాకాయి. నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. మీ ప్రేమ, మద్దతులతో నేను ఇంకా బాగా పని చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాను. మీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు." అని ఎక్స్ లో రాసుకొచ్చారు.
అంతే కాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్‌లో:
"రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతమైంది. ఆయనే కాకుండా, ఆయన పోషించిన పాత్రలు కూడా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇటువంటి చరిత్రాత్మక సినీ జీవితం, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన రజనీకాంత్ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుతున్నాను." అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రధాని మోదీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రయాణాన్ని గుర్తించి, ఈ స్థాయిలో అభినందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సినిమాల్లో 50 ఏళ్లకు పైగా కొనసాగుతూ ప్రేక్షకుల మన్ననలు పొందిన రజనీకాంత్ ఈ ఘన విజయానికి శుభాకాంక్షలు అందుకోవడంతో తలైవా అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ప్రేక్షకుల ప్రేమ, సహకారం వల్లే తన సినీ ప్రయాణం ఇంత దూరం వచ్చిందని రజనీకాంత్ పేర్కొంటున్నారు.రాబోయే కాలంలో కూడా ఆయన నుంచి మరిన్ని గొప్ప సినిమాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.