బిగ్‌ బ్రేకింగ్‌ః `అన్నాత్తే` చిత్ర యూనిట్‌కి కరోనా.. ఆగిపోయిన షూటింగ్‌..టెన్షన్‌లో రజనీ

Published : Dec 23, 2020, 03:05 PM ISTUpdated : Dec 23, 2020, 03:08 PM IST
బిగ్‌ బ్రేకింగ్‌ః `అన్నాత్తే` చిత్ర యూనిట్‌కి కరోనా.. ఆగిపోయిన షూటింగ్‌..టెన్షన్‌లో రజనీ

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర షూటింగ్‌ నిలిచిపోయింది. ఈ చిత్ర బృందంలోని ఎనిమిది మంది కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో హుటాహుటిని చిత్ర షూటింగ్‌ని నిలిపివేశారు. అంతేకాదు ఇప్పుడు రజనీకాంత్‌ టెన్షన్‌లో పడ్డారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర షూటింగ్‌ నిలిచిపోయింది. ఈ చిత్ర బృందంలోని ఎనిమిది మంది కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో హుటాహుటిని చిత్ర షూటింగ్‌ని నిలిపివేశారు. అంతేకాదు ఇప్పుడు రజనీకాంత్‌ టెన్షన్‌లో పడ్డారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివకుమార్‌ `అన్నాత్తే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. కీర్తిసురేష్‌, నయనతార, ఖుష్బు, మీనా వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తుంది. ఇటీవలే సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుంది. యూనిట్‌లో కొంత మంది సిబ్బందికి అనారోగ్యానికి గురి కావడంతో కరోనా చేయించుకున్నారు. అందులో ఎనిమిది మంది క్రూకి పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే షూటింగ్‌ ఆపేశారు. అంతేకాదు రజనీ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. 

ఈ వార్త రజనీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా కంప్లీట్‌ చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని రజనీ భావించారు. అందుకు ప్లాన్‌ కూడా రెడీ చేశారు. జనవరిలో పార్టీ పేరుని ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి అవాంతరం ఎదురుకావడం విచారకరం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా