వంద జన్మలైనా రజనీకాంత్‌గానే పుట్టాలి, సూపర్‌ స్టార్‌ ఎమోషనల్‌.. 50 ఏళ్ల సినీ ప్రస్థానం జీవిత సాఫల్య పురస్కారం

Published : Nov 28, 2025, 09:53 PM IST
rajinikanth

సారాంశం

Rajinikanth: గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో, భారతీయ సినిమా రంగానికి రజనీకాంత్ చేసిన సేవలకు గాను ఆయనకు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

గోవాలో 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

గోవాలో 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గత 20వ తేదీన మొదలైంది. ఈ వేడుకలో 81 దేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించారు.  `గీతాంజలి`తోపాటు 240కి పైగా చిత్రాలను స్క్రీనింగ్ చేశారు. ఇక ఈ వేడుక ముగింపు రోజున రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.  లతా రజనీకాంత్, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, విశ్వధన్‌, యాత్ర, లింగ కూడా పాల్గొన్నారు.

రజనీకాంత్‌కు జీవిత సాఫల్య పురస్కారం

సినిమా రంగంలో రజినీకాంత్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన సేవలను గుర్తిస్తూ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి మురుగన్‌తో పాటు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి బాగా ఈ వేడుకలను నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో నన్ను బతికించిన దైవాలైన  ఆడియెన్స్ కి, అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు రజనీకాంత్‌. 

వంద జన్మలైనా రజనీకాంత్‌గానే పుట్టాలి

ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ పది, పదిహేనేళ్లు అయిపోయినట్టుగానే ఉంది. ఎందుకంటే నాకు సినిమా, నటన అంటే ఇష్టం. నాకు వంద జన్మలు ఉంటే మళ్లీ నటుడిగానే, అందులోనూ రజనీకాంత్‌ లాగానే పుట్టాలని కోరుకుంటాను. ఈ జర్నీలో భాగమైన సినిమా ఇండస్ట్రీకి, దర్శకులు, నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇలా అందరికి ధన్యవాదాలు` అని చెబుతూ, ప్రత్యేకంగా తమిళ ఆడియెన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు రజనీకాంత్‌. 

`జైలర్‌ 2`లో నటిస్తున్నా

ఈ కార్యక్రమంలో మాట్లాడిన రణ్‌వీర్ సింగ్, రజనీకాంత్ గురించి మాట్లాడటానికి తన దగ్గర మాటలు లేవన్నారు. 'టైగర్ కా హుకుమ్‌'. 'జైలర్ 2'లో నటిస్తున్నాను. నాకు సినిమా, నటన అంటే చాలా ఇష్టం. ఆ రెండింటినీ నేను ప్రేమిస్తాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'జైలర్ 2' సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రజనీతో పాటు ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు,  నటిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 12న విడుదల కానుందని సమాచారం.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు