సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం, తండ్రిని కోల్పోయిన స్టార్ డైరెక్టర్

Published : Nov 26, 2025, 01:51 PM IST
sampath

సారాంశం

Sampath Nandi Father Passes Away : ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంపత్ నందికి పితృవియోగం కలిగింది. అనారోగ్య కారణాల వల్ల సంపత్ తండ్రి కిష్టయ్య కన్నుమూశారు.

సంపత్ నందికి పితృవియోగం

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య (73) మంగళవారం రాత్రి అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం సంపత్ నంది హీరో శర్వానంద్‌తో రూపొందిస్తున్న భోగి చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఒకేసారి సాగుతున్న తరుణంలో ఈ దుర్వార్త అందడంతో దర్శకుడు వ్యక్తిగతంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు, సహచరులు సంపత్ నందికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో సంపత్ నంది ప్రయాణం

సంపత్ నంది సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఫార్మసీ చదివినప్పటికీ, సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగా ఆయన హైదరాబాద్‌కు వచ్చి రచయిత పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా పని ప్రారంభించారు. ఆ అనుభవంతో పాటు కొన్ని యాడ్‌ఫిలిమ్స్‌ను దర్శకత్వం వహించి, తరువాత పూర్తిస్థాయి దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. దర్శకుడిగా ఆయన ఎన్నో విజయాలు సాధించారు. మంచి సక్సెస్ లతో పాటు డిజాస్టర్స్ కూడా ఫేస్ చేశాడు సంపత్.

ప్రముఖుల సంతాపం

అయితే ఇండస్ట్రీలో సంపత్ నంది కమర్షియల్ ఎంటర్టైనర్‌ సినిమాలతోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ ను సాధించాయి. రీసెంట్ గా సంపత్ పర్యవేక్షణలో తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ఓదెల 2 విడుదలైంది. ఈ ప్రాజెక్ట్ కూడా ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం వరుసగా అవకాశాలు వస్తున్న టైమ్ లో.. తన తండ్రి మృతి వార్త సంపత్ నందిని తీవ్రంగా కలచివేసింది. సినీ వర్గాలు, అభిమానులు, పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా సంపత్ నందీకి సానుభూతి తెలియజేస్తూ, నంది కిష్టయ్యకు నివాళి అర్పిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పెళ్లికి ఓకే చెప్పిన జ్యో- తండ్రితో కన్నీళ్లు పెట్టించిన కాంచన
రామ్ చరణ్ అర్జునుడు, కర్ణుడిగా ప్రభాస్, రాజమౌళి మహ భారతంలో కృష్ణుడు ఎవరో తెలుసా? వైరల్ అవుతున్న వీడియో