బిగ్‌ బీని ఉద్దేశించి రజనీకాంత్‌ ఎగ్జైటింగ్‌ నోట్‌.. ఫస్ట్ టైమ్‌ ఇద్దరు అలా.. సంచలనాలకు రంగం సిద్ధం..

దాదాపు 33ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కలిసి నటించబోతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఓ తేడా ఉంది. అప్పట్లో బిగ్‌ బీ సినిమాలో రజనీకాంత్‌ నటించేవారు.

Google News Follow Us

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కలిసి పలు సినిమాల్లో నటించారు. చివరిసారిగా 1991లో `హమ్‌` అనే మూవీలో నటించారు. ఇది క్రిటికల్‌గా, కమర్షియల్‌గా పెద్ద హింట్‌ అయ్యింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతకు ముందు `అందా కానూన్‌`(1983), `గీరాఫ్తార్‌`(1985` చిత్రాలు చేశారు. ఈ మూవీస్‌ కూడా ఫర్వాలేదనిపించాయి. 

ఇదిలా ఉంటే దాదాపు 33ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కలిసి నటించబోతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఓ తేడా ఉంది. అప్పట్లో బిగ్‌ బీ సినిమాలో రజనీకాంత్‌ నటించేవారు. ఈ ఇద్దరు చేసినవన్నీ హిందీ మూవీస్‌. కానీ ఇప్పుడు రజనీ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. అవును.. `జై భీమ్‌` ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ ప్రస్తుతం `తలైవర్‌170` చిత్రం చేస్తున్నారు. ఇది భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది.  అమితాబ్‌ బచ్చన్‌తోపాటు తెలుగు నుంచి రానా, మలయాళం నుంచి ఫహద్‌ ఫాజిల్తోపాటు కోలీవుడ్‌ ఆర్టిస్టులు చేస్తున్నారు. 

లైకా నిర్మించే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే తాజాగా అమితాబ్‌, రజనీకాంత్‌ కలుసుకున్నారు. `తలైవర్‌170`కోసం ఈఇద్దరు కలిశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు రజనీ. బిగ్‌ బీతో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ `33ఏళ్ల తర్వాత టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రాబోయే లైకా మూవీ `తలైవర్ 170`లో నా గురువు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది` అని ట్వీట్‌ చేశారు రజనీ. ప్రస్తుతం ఈ పోస్ట్ పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. 

అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల సౌత్‌ సినిమాలు విరివిగా చేస్తున్నారు. `సైరా` నరసింహారెడ్డిలో చేశారు. ఇప్పుడు `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు.  ఇంత బిజీగా ఉన్న ఆయన మరో సౌత్‌ మూవీ చేయడం విశేషం.  ఈ సందర్బంగా ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు రజనీకాంత్‌. ఇక రజనీకాంత్ ఇటీవల `జైలర్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇది ఆరు వందల కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మరో సంచలనాలకు తెరలేపుతున్నారు.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!