బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. వెంటనే కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. మొదటి టాస్క్ లో ప్రియాంక గెలవగా... శోభా ఓడిపోయింది.
బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. చివరికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని హెచ్చరించాల్సి వచ్చింది. నామినేషన్స్ ముగిశాక... మాటలు, చేతలు అదుపులో ఉంచుకోవాలని బిగ్ బాస్ అందరికీ సూచించాడు. 8వ వారానికి అమర్ దీప్, శివాజీ, సందీప్, శోభా, ప్రియాంక, అశ్విని, భోలే, గౌతమ్ నామినేట్ అయ్యారు. నామినేషన్స్ ముగిసిన అనంతరం బిగ్ బాస్ టాస్క్ మొదలైంది.
బిగ్ బాస్ మారథాన్ పేరుతో కెప్టెన్సీ టాస్క్ మొదలుపెట్టారు. ప్రతి టాస్క్ లో గెలిచినవారు కెప్టెన్సీ కంటెండరు అవుతారు. సదరు టాస్క్ లో అందరికంటే వెనుకబడ్డవారు కంటెండర్ రేసు నుండి తప్పుకుంటారు. మొదటి టాస్క్ లో తేజా, శోభా, ప్రియాంక, అమర్ దీప్ పోటీపడ్డారు. బ్రెయిన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, ఒక్కొక్క వస్తువును సంచాలక్ చూపిస్తూ ఉంటాడు. అది నీటిలో మునుగుతుందో? తేలుతుందో? చెప్పాలి.
ఫైవ్ స్టార్ చాకోలెట్ విత్ కవర్, విత్ అవుట్ కవర్, పుచ్చకాయ, వేరు శనక్కాయ, ప్లాస్టిక్ గ్లాస్, ఐస్, కోక్ టిన్ వంటి వస్తువులు మునుగుతాయో లేదో చెప్పాలని ఈ నలుగురిని అడిగారు. ఈ టాస్క్ లో అందరికంటే ఎక్కువ రైట్ సమాధానాలు చెప్పి ప్రియాంక గెలిచింది. తక్కువ సరైన సమాధానాలు చెప్పిన శోభా శెట్టి ఓడిపోయింది. దీంతో ఆమె కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో శోభా శెట్టి ముఖం మాడిపోయింది.
మైండ్ గేమ్ అండ్ నాలెడ్జ్ గేమ్ లో అమర్ దీప్, శోభా చేతులు ఎత్తేశారు. తేజా కొంచెం పర్లేదు అనిపించుకున్నాడు. ప్రియాంక కెప్టెన్సీ రేసులో ముందుకు వెళ్ళింది. ప్రస్తుత కెప్టెన్ గా అర్జున్ ఉన్నాడు. నెక్స్ట్ కెప్టెన్ ఎవరో చూడాలి...