గెట్‌వెల్ సూన్‌ బాలు సర్‌..రజనీకాంత్‌

Published : Aug 17, 2020, 01:40 PM ISTUpdated : Aug 17, 2020, 01:49 PM IST
గెట్‌వెల్ సూన్‌ బాలు సర్‌..రజనీకాంత్‌

సారాంశం

బాలు కోలుకోవాలని సినీతారలు కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తమ సందేశాలను అందిస్తున్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, కమల్‌హాసన్‌ ఇలా అనేక మంది స్పందించారు. తాజాగా రజనీకాంత్‌ స్పందించారు.

గాయకుడు బాలసుబ్రమణ్యం, రజనీకాంత్‌కి విడదీయలేని బంధం ఉంది. ఎందుకంటే చాలా వరకు రజనీకాంత్‌ సినిమాలకు తెలుగులో ఆయన పాత్రలకి బాలు డబ్బింగ్‌ చెబుతుంటాడు. ఈ లెక్కన కమల్‌హాసనే కాదు, సూపర్‌ స్టార్‌ రజనీకి కూడా బాలునే గొంతుక. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలోకి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. 

కరోనా తీవ్ర కావడంతో బాలు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్ని ఐసీయుకి తరలించి వైద్యం అందిస్తున్నారు. రెగ్యులర్‌ ట్రీట్‌మెంట్‌కి కరోనా నయం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా ప్లాస్మా ద్వారా వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

మరోవైపు బాలు కోలుకోవాలని సినీతారలు కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తమ సందేశాలను అందిస్తున్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, కమల్‌హాసన్‌ ఇలా అనేక మంది స్పందించారు. తాజాగా రజనీకాంత్‌ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. అందులో తమిళంలో ఆయన చెబుతూ, బాలు త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాటలను కొనియాడారు. గెట్‌ వెట్‌ సూన్‌ బాలు సర్‌ అని ట్వీట్‌ చేశారు. 

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్