
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా మూవీ జైలర్. ఈసినిమాలో ఆయన సరసన తమన్నా హీరోయిన్ గానటిస్తోంది. సెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కురెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సూపర్ స్టార్’ అనే ట్యాగ్ తనకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు.
జైలర్ సినిమాలోని హుకుమ్ పాటతనకుఎంతో ఇష్టం అని.. అందుకే అంత ఇష్టమైన పాట నుంచి సూపర్ స్టార్ ట్యాగ్ ను తొలగించాల్సిందిగా మేకర్స్ ను తానుకోరినట్టు వెల్లడించారు రజనీకాంత్. ఆట్యాగ్ తనను ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతుందని అన్నారు. అంతే కాదు అది తనకు ఎప్పటి నుంచో తలనొప్పిగా మారిందన్నారు తలైవా. ఇప్పుు కాదు 1977 నుంచి సూపర్ స్టార్ వివాదం నడుస్తుందన్నారు. అప్పట్లో కమల్ హాసన్, శివాజీ గణేషన్ లాంటి పెద్ద నటులు ఉండగా.. సూపర్ స్టార్ హోదాను తనకు తగిలించారన్నారు. అప్పట్లో అది పెద్ద వివాదంగా మారిందన్నారు రజనీకాంత్.
ఈసంద్భంగా ఆయన ఓ కథను కూడా చెప్పారు. ఒక అడవిలో కాకి, గ్రద్ద రెండు ఉంటాయి. కాకి.. గ్రద్ద మాదిరి ఎగరాలని అనుకుంటుంది. కానిఅది ఎన్నటికీ గ్రద్దలా అంత హైట్కు ఎగరలేదు అంటూ ఎక్జాంపుల్ చెప్పారు. అంతే కాదు చాలా మంది చాలా సాధించాం అనుకుంటారు. స్టార్ వారసత్వాన్నితీసుకుని.. స్టార్లు అయ్యాం అనుకుంటారు.. కాని స్టార్ల వారసత్వాన్ని తీసుకోవడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవాలి అంటూ సూపర్ స్టార్ అన్నారు. ఆయన స్టార్ హీరో విజయ్ కు చురకలు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నాత్తే అనగా పెద్దన్నా.. సినిమా తర్వాత చాలా కథలను విన్నానని, కానీ అవి బాషా, అన్నామలై మాదిరి అనేపించడంతో తిరస్కరించానని చెప్పారు. ఈ సినిమాను తాను దర్శకుడు నెల్సన్‌తో చేయడంపై విమర్శలు వచ్చాయని, కొందరు డైరెక్టర్‌ను మార్చాలని అన్నారని గుర్తు చేశారు. నెల్సన్‌తో కలిసి పనిచేయాలనే తన నిర్ణయంపై తనకు స్పష్టత ఉందని చెప్పారు. ఇక ఆడియో రిలీజ్ కార్యక్రమానికి కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు.