రజినీకాంత్ 'పేటా' సినిమా ట్రైలర్!

Published : Dec 28, 2018, 11:24 AM IST
రజినీకాంత్ 'పేటా' సినిమా ట్రైలర్!

సారాంశం

రజినీకాంత్ హీరోగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ 'పేటా' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

రజినీకాంత్ హీరోగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ 'పేటా' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. కథ ప్రకారం సినిమాలో రజినీకాంత్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.  అందులో ఒకటి హాస్టల్ వార్డెన్ పాత్ర అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. 

ట్రైలర్ లో ఒక సన్నివేశంలో కుర్ర హీరోయిన్ మేఘాఆకాష్ కూడా కనిపించింది. బాబీ సింహా, నవజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతిల పాత్రలను వైవిధ్యంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్