పవన్ ఫ్యాన్స్ పై రేణుదేశాయ్ కామెంట్స్!

Published : Dec 28, 2018, 11:08 AM IST
పవన్ ఫ్యాన్స్ పై రేణుదేశాయ్ కామెంట్స్!

సారాంశం

నటి రేణుదేశాయ్ పవన్ నుండి విడిపోయినా.. తరచూ ఏదొక సంఘటనతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో రేణు 'A Love, Unconditional' అనే పుస్తకాన్ని రచించింది. 

నటి రేణుదేశాయ్ పవన్ నుండి విడిపోయినా.. తరచూ ఏదొక సంఘటనతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో రేణు ''A Love, Unconditional' అనే పుస్తకాన్ని రచించింది. ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసే పనిలో పడింది రేణు.

ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తోంది ఈ బ్యూటీ. అయితే ఈ పుస్తకం పవన్ గురించేనా..? అని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు ఈ విషయమై స్పందించింది.

పవన్ అభిమానులు అనుకుంటున్నట్లు ఈ పుస్తకం పవన్ గురించి కాదని స్పష్టం చేసింది. ప్రతీ విషయాన్ని పవన్ కళ్యాణ్ తో లింక్ చేయొద్దని కోరింది. తనకంటూ ఒక జీవితం ఉందని, పుస్తకంలో ఉన్నవి తన ఆలోచనలే కానీ ఏ వ్యక్తికి సంబంధించింది కాదని వెల్లడించింది.  

అలానే.. ''నేను గతాన్ని వదిలేసి ముందుకు వెళ్తున్నాను. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు'' అంటూ పవన్ ఫ్యాన్స్ పై కామెంట్స్ చేసింది. త్వరలోనే రేణు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనే విషయాన్ని మాత్రం సీక్రెట్ గానే ఉంచింది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి