ఒక సారి తన కూతురితో సినిమా చేసి గట్టిదెబ్బ తిన్నాడు సూపర్ స్టార్ రజనీ కాంత్. మరోసారి మరో కూతురితో సినిమాకు రెడీ అవుతున్నాడట తలైవా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాడుతో పాటు.. సౌత్, నార్త్ లో ఆయనకు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే..? 7 పదుల వయస్సులో కూడా వరుస సనిమాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు సూపర్ స్టార్. కాని గత కొంత కాలంగా తలైవా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే సూపర్ స్టార్ ఎక్కువగా కొత్త దర్శకులకు, యంగ్ డైరెక్టర్లకు అవాకాశం ఇస్తున్నారు. వారు కూడా సినిమా హిట్ అయినా.. లేకున్నా.. రజనీ కాంత్ ను స్టైలీష్ లుక్స్ లో చూపిస్తూ.. సరికొత్త రజనీ కాంత్ ను ఫ్యాన్స్ కు పరిచయం చేస్తున్నారు.
ప్రస్తుత రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమా తరువాత రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ సంస్థలో రెండు సినిమాలకు సైన్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకూ ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమా చేయబోతున్నారట సూపర్ స్టార్.
రజనీ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంతో సినిమాచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా సిద్ధమయినట్లు సమాచారం. ఐశ్వర్య గతంలోనే దర్శకురాలిగా పరిచయం అయ్యింది. ధనుష్- శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కిన 3 మూవీతో దర్శకురాలిగా మారింది. ఆతరువాత వాయ్ రాజా వాయ్, సినిమా వీరన్ వంటి సినిమాలను తెరకెక్కించింది. ఇక ఇప్పుడు తనతండ్రితో సినిమా చేయడానికి రెడీ అవుతుంది ఐశ్వర్య. ఇక రీసెంట్ గా ఆమె ధనుష్‌తో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఐశ్వర్య సినిమాల్లో బిజీ అవుతోంది. డైరెక్టర్ గా స్టార్ డమ్ సాధించాలని చూస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య ఓ సాతి చల్ అనే హిందీ సినిమా చేస్తుంది.
అయితే రజనీ కాంత్ గతంలో తన కూతురు సౌందర్య రజనీ కాంత్ డైరెక్షన్ లో కొచ్చడయాన్ సినిమా చేశాడు రజనీ కాంత్. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లోనే ఈమూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మూవీలో సూపర్ స్టార్ యానిమేషన్ లో కనిపించడం. అసలు జనాలకు కనెక్ట్ అవ్వకపోవడంతో.. చాలా విమర్షలు వచ్చాయి. ఆరతువాత ఎప్ప్పుడూ మళ్లీ..ఇలాంటిప్రయత్నం చేయలేదు. అయితే ఐశ్వర్య ధనుష్ కు మాత్రం దర్శకత్వంలో కాస్త అనుభవం ఉండటంతో రజనీ కాంత్ ఈ సినిమాకుసరే అన్నట్టు తెలుస్తోంది.