`పుష్ప 2` అదిరిపోయే అప్‌డేట్‌.. బన్నీ ఫ్యాన్స్ కి ఊహించని సర్‌ప్రైజ్..

Published : Nov 02, 2022, 01:54 PM ISTUpdated : Nov 02, 2022, 02:08 PM IST
`పుష్ప 2` అదిరిపోయే అప్‌డేట్‌.. బన్నీ ఫ్యాన్స్ కి ఊహించని సర్‌ప్రైజ్..

సారాంశం

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న `పుష్ప 2` చిత్ర షూటింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. బన్నీ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు టీమ్‌ ప్లాన్‌ చేస్తుండటం విశేషం. 

ఇటీవల సినిమాలకు సంబంధించి మొదటి పార్ట్ లు భారీ విజయాలు సాధించడంతో రెండో భాగాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. `బాహుబలి`, `కేజీఎఫ్‌` చిత్రాలు రెండు పార్ట్ ల ట్రెండ్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో `పుష్ప` మూవీ కూడా రెండు భాగాలుగా వస్తోన్న విషయం తెలిసిందే. `పుష్పః ది రైజ్‌` హిట్‌ కావడంతో రెండో పార్ట్ పై దేశ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో సినిమాని భారీ లెవల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. 

అల్లు అర్జున్‌ స్టయిల్‌ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. ముఖ్యంగా బన్నీ చెప్పే `తగ్గేదెలే` డైలాగ్‌ ఇండియా దాటి పాపులారిటీని సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగా అంతకు మించి అనేలా రెండో భాగం `పుష్ప 2`ని ప్లాన్‌ చేస్తున్నారు సుకుమార్‌. బడ్జెట్‌ కూడా పెంచారు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమై కొంత భాగం షూటింగ్‌ జరిగింది. అయితే గత వారమే ప్రారంభం కావాల్సిన ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. లోకేషన్ల విషయంలో సంతృప్తిగా లేని సుకుమార్‌ షూటింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే నెక్ట్స్ షెడ్యూల్‌ ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. నవంబర్‌ రెండో వారంలో షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారట. నవంబర్‌ 13న నెక్ట్స్ షెడ్యూల్‌కి సంబంధించిన షూట్‌ని ప్లాన్‌ చేసినట్టు సమాచారం. అయితే ఈ షూటింగ్‌ని బ్యాంకాక్‌లో ఉండబోతుందట. ఇది మూడో వారంలో స్టార్ట్ అవుతుందట. అంతకంటే ముందు హైదరాబాద్‌లో ఓ చిన్న షూటింగ్‌ నపార్ట్ ఉందని, కొన్ని సీన్లని ప్రత్యేకంగా చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. 

`పుష్ప2` నుంచి ఇప్పటి ఎలాంటి పోస్టర్లు గానీ, వీడియోలుగానీ రాలేదు. దీంతో ఓ సర్‌ప్రైజ్‌ని ప్లాన్‌ చేశారట. టీజర్ లాగా ఓ ర్యాంపేజ్‌ వీడియోని విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకోసం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపబోతున్నారని, ఆ వీడియోని కూడా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. బన్నీ ఫ్యాన్స్ కిది సడెన్‌ సర్‌ప్రైజ్‌గా ఇవ్వాలనుకుంటున్నారని సమాచారం.  ఇక ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. 

మొదటి భాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించి పుష్పరాజ్‌ ఎదగడం చూపించారు. రెండో భాగంలో ఆయన రూల్‌ చేయడాన్ని చూపించబోతున్నారని సమాచారం. రూల్‌ చేసే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు సెకండ్‌ పార్ట్ లో ఉంటాయట. అసలు కథ ఇక్కడే ఉంటుందని, చాలా వరకు ఆయన పతనం ఇందులో చూపించబోతున్నారని, దాన్నుంచి మళ్లీ పుష్పరాజ్‌ ఎలా నిలబడ్డాడనేది ప్రధాన స్టోరీగా ఉంటుందట. ఇందులో బన్నీకి జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు రెండో పార్ట్ లో మరో హీరోయిన్‌ కనిపించబోతుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. భన్వర్‌ సింగ్‌ షేకావత్ గా నెగటివ్‌ రోల్‌లో ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తుండగా, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్