
తమిళనాట మల్టీ స్టారర్స్ ఈమధ్య ఎక్కువైపోయాయి. స్టార్ హీరోల కాంబినేషన్స్ తో సినిమాలు చేసి.. కాస్తో కూస్తో భారీ సినిమాలు అనిపించుకోవాలి అని ట్రై చేస్తున్నారు కోలీవుడ్ హీరోలు. ఇప్పటికే తమిళనాట కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కి.. బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో మరో క్రేజీ భారీ కాంబినేషన్ కు.. సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
70 ఏళ్ళు దాటిన తరువాత కూడా ఏమాత్రం జోరు తగ్గిచడంలేదు తమిళ స్టార్ హీరో రజనీకాంత్. కుర్ర హీరోలకుసైతం పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు తమిళ తలైవా. సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 169వ సినిమా చేస్తున్నాడు. జైలర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాతో పాటు సూర్యతో జైభీమ్ సినిమా చేసిన టీజే జ్ఞానవేళ్‌దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నారు రజనీ. తలైవా 170 టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమాకు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈసినిమాలో రజనీకాంత్ తో పాటు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నటు న్యూస్ వైరల్ అవుతోంది. విక్రమ్ ను ఈ సినిమాలో నటించమని అడిగాడట దర్శకుడు టీజే జ్ఞానవేళ్.అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఈసినిమాలో రజనీకాంత్ కు విలన్ గా నటించాల్సిందిగా విక్రమ్ ను కోరాడట దర్శకుడు అయితే ఈ విషయంలో విక్రమ్ నో చెప్పాడని టాక్ నడుస్తోంది. కాని పట్టువదలకుండా.. దర్శకుడు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. విక్రమ్ ఒప్పుకుంటే బాగుండు.. విక్రమ్-రజినీకాంత్ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో విక్రమ్ మనసు మార్చుకుంటాడా.. లేదా అనేది చూడాలి. ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ క్రేజీ కాంబోకోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 ప్రాజెక్ట్ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. టీజే జ్ఞానవేళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, మోహన్ లాల్, సునీల్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జైలర్ గ్లింప్స్ వీడియోతోపాటు మోహన్ లాల్, సునీల్, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.