
రీసెంట్ గా అమితాబ్ రోడ్డు మీద ట్రాఫిక్ లో.. ఓ అపరిచిత వ్యాక్తి బైక్ పై కనిపించారు. దానికి సబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో శేర్ చేయడంతో పాటు.. చిన్న నోట్ కూడా రాశారు. సమయానికి షూటింగ్ కు చేరుకునేలా సాయం చేశారు.. అపరిచిత వ్యాక్తికి ధన్యవాదాలు అంటే కామెంట్ పెట్టాడు బిగ్ బీ. అంతా బాగానే ఉంది కాని.. అమితాబ్ ప్రయాణంపై మాత్రం కొంత మంది నెటిజన్లు మండిపడ్డారు. పోలీసులకు ట్యాక్ చేస్తూ.. హెల్మెట్ లేకుండా సెలబ్రిటీ ఇలా ప్రయాణం చేస్త ఎలా అని కామెంట్టు పెట్టారు. దాంతో ముంబయ్ పోలీసులు ఈ విషయంలో సున్నితంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు.
ఇక ఈవిషయంలో బిగ్ బీ అమితాబ్ స్పందించారు. ఆయన తనవైపు వివరణ ఇచ్చారు షూటింగ్‌కు లేటవుతుందనే కారణంతో అపరిచితుడి బైక్‌పై ప్రయాణం చేశానన్నారు బిగ్ బీ... ఈ విషయంలో విమర్షలపై అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ…ఆదివారం కాబట్టి రోడ్డుపై రద్దీ ఉండదని ముంబైలోని బల్లార్డ్ వీధిలో మా సినిమా షూటింగ్ ఏర్పాట్లు చేశారు. అక్కడికి కొద్ది దూరంలోనే మా కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దాంతో లొకేషన్‌కు ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లాను. ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి మాత్రమే బైక్‌పై ప్రయాణించా. అది ప్రధాన రహదారి కాదు. నడుస్తూ వెళ్తే సెక్యూరిటీ సమస్య వస్తుందని భావించా అని వివరణ ఇచ్చారు అమితాబ్.
అంతే కాదు అమితాబ్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ.. బాధ్యతగా ఉంటారని.. చట్టాలను గౌరవిస్తారని, తమ అభిమానులకు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తారని ఆయన టీమ్ మెంబర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో కూడా అమితాబ్ ను విమర్షించేవారికి... రివర్స్ లో కౌంటర్లు కూడా ఇస్తున్నారు బిగ్ బీ ఫ్యాన్స్. ఇక సరిగ్గా ఇలానే చేసింది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. ఆమె కూడా బైక్ పై వెళ్తూ హెల్మెట్ లేకుండా కనిపించింది. మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యాక్తి కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో.. మరిన్ని విమర్షలు వస్తున్నాయి అనుష్క శర్మపై.