సంక్రాంతి వార్ నుంచి తప్పుకున్న రజినీకాంత్, కారణం ఇదే..?

Published : Dec 22, 2023, 08:42 AM IST
సంక్రాంతి వార్ నుంచి తప్పుకున్న రజినీకాంత్, కారణం ఇదే..?

సారాంశం

ఈ సారి సంక్రాంతి వార్ రసవత్తరంగా మారబోతోంది. అయితే ..పెద్ద పెద్ద సినిమాలు పోటీకి ఉండగా.. అప్పటికి ఎవరు డ్రాప్ అవుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి వార్ నుంచి తమిళ తలైవా తప్పుకున్నట్టు తెలుస్తోంది. 

2024 సంక్రాంతి బరిలో తెలుగులో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటికి తోడు తమిళ సినిమాలు కూడా పోటీకి దిగాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునే సినిమా రజినీకాంత్ లాల్ సలామ్ మూవీ.  మన సినిమాలకే థియేటర్లు అడ్జెస్ట్ చేయడం ఎలా  అని తలపట్టుకుంటుంటే.. ఈమధ్యలోకోలీవుడ్ హీరోలు కూడా దూరిపోడంతో.. ఎప్పటికప్పుడు హీట్ పెరిగిపోతోంది. ఇప్పటికే  సరిపోవని బయ్యర్స్ ఇబ్బందులు పడుతుంటే అదే సమయంలో మూడు తమిళనాడు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

 అయితే తాజా సామాచారం ప్రకారం ఈమూడు సినిమాల్లో చాలా ముఖ్యమైన సినిమా సూపర్ స్టార్  రజినీకాంత్ నటించిన లాల్ సలాం. ఈసినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మిగతా రెండు సినిమాల్లో రజనీకాంత్ అల్లుడు ధనుష్  నటించిన'కెప్టెన్ మిల్లర్ మాత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగులో పొంగల్ వార్ హీట్ ఎక్కువగా ఉండటం.  లాల్ సలామ్ సినిమాలో రజినీది గెస్ట్ రోల్ మాత్రమే కావడంతో.. పెద్ద సినిమాల ముందు నిలబడటం ఎందుకు  భారీ పోటీ మధ్య నలిగిపోవడం కరెక్ట్ కాదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. 

కోలీవుడ్ నుంచి శివ కార్తికే 'అయలాన్' మూవీ మాత్రం ఇంకా సంక్రాంతి బరిలోనే ఉంది. నిజం చెప్పాలంటే 'లాల్ సలాం' మూవీ మీద ఆడియన్స్ లో ఆశించిన స్థాయిలో హైప్ లేదు. పెద్దగా ప్రమోషన్లు కూడా చేయడం లేదు. కాని  కోలీవుడ్ లో మాత్రం ఈసినిమాకు  భారీ క్రేజ్ ఉంది. అయితే రిలీజ్ డేట్ కన్ ఫార్మ్ అయితే ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవచ్చ అని అనుకుంటున్నారు మేకర్స్. అయితే నెక్ట్స్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. జనవరిలో రిలీజ్ కావల్సిన విక్రమ్ తంగలాన్  పోస్ట్ పోన్ అయ్యింది. జనవరి 26న రావల్సిన ఈసినిమా సమ్మర్ కు వెళ్ళిపోయింది. ఆ డేట్ ను లాల్ సలామ్ ఆక్యూపై చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. 

 జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో జోష్ పెంచారు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఆయన మార్కెట్ కూడా భారీగా పెరిగింది.  జైలర్ కంటే ముందు వరకు వరుస ప్లాప్స్ తో పూర్తిగా డౌన్ అయిన సూపర్ స్టార్ రేంజ్ ని జైలర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే లాల్ సలాం విషయంలో లైకా నిర్మాణ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. స్పోర్ట్స్ కం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కడం, రజినీకాంత్ ఫస్ట్ టైమ్ ముస్లిం లీడర్ గా కనిపిస్తుడటంతో 'లాల్ సలామ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..