ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్, టాలీవుడ్ నుంచి ఫస్ట్ హీరో..

Published : Dec 22, 2023, 08:08 AM IST
ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్, టాలీవుడ్ నుంచి ఫస్ట్ హీరో..

సారాంశం

మరో అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన తారక్.. అప్పటి నుంచి ఏదో ఒక ఘనతను సాధిస్తూ వస్తున్నారు. 

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో మన తెలుగు హీరోలు ప్రపంచ స్థాయిలో చాలా సాధించారు. టాలీవుడ్ పేరును ఓ రేంజ్ లో పెంచారు.ఈక్రమంలో  గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు. ముఖ్యంగా  నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ హీరోగా మారడంతో పాటు.. కొన్ని అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమాలో కొమ్రం భీం పాత్రలో అరించాడు  తారక్‌. ఆస్కార్ వేదికగా ఎక్కువ మంది తారక్ గురించే మాట్లాడుకోవడం.. ఆ సర్వేలో ఎన్టీఆర్ మొదటి స్థానం సాధించాడు. ఇక ఆస్కార్ కమిటీలో ప్లేస్ సంపాదించడంతో పాటు.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో గౌరవాలు పొందాడు తారక్. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజ్ లో మెరిసిన నందమూరి యంగ్ టైగర్.. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

తాజాగా  బ్రిటన్‌లో పాపులర్‌ అయిన ఏసియన్ వీక్లీ న్యూస్‌ EasternEye 2023 కిగాను టాప్‌ 50 ఏసియన్‌ స్టార్స్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్ కు కూడా స్థానం లభించింది. జూనియర్‌ ఎన్టీఆర్ ఈ జాబితాలో 25వ స్థానంలో నిలిచాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక తెలుగు నటుడిగా తారక్  అరుదైన ఘనతను సాధించాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఈన్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

అంతే కాదు హాలీవుడ్ మ్యాగ‌జైన్ వెరైటీ 500 జాబితాలో కూడా ఎన్టీఆర్ ప్లేస్ సాధించారు. అంతే కాదు  తారక్ తో పాటు ఈజాబితాలో రాజమౌళి కూడా చేరారు. దాంతో టాలీవుడ్ ప్రపంచ సినిమాలో మరో మెట్టు ఎక్కినట్టు అయ్యింది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఎంతో సంతోషపడుతున్నారు. రాజమౌళి మొదటి సినిమా ఎన్టీఆర్ తో చేశారు. అప్పటి నుంచి వీరి కాంబోలో వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తం గుర్తింపు సాధించింది ఈ కాంబో. దాంతో వీరిద్దరి కలయికలో ఇంకా అద్భుతమైన సినిమాలు రావాలని..  అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం దేవర సినిమా బిజీలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీగా.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది మూవీ. ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీతో ఆమె సౌత్ ఎంట్రీ ఇస్తోంది.  ఇక ఈమూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఈమూవీ షూటింగ్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?