
సూపర్ స్టార్ రజనీకాంత్ కి చాలా రోజుల తర్వాత హిట్ పడింది. `జైలర్` సినిమాతో హిట్ కొట్టాడు సూపర్ స్టార్. గురువారం విడుదలైన `జైలర్` సినిమాకి పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. మొదట్లో కొంత మిశ్రమ స్పందన లభించినా, వింటేజ్ రజనీ కనిపించడం, ఎలివేషన్లు, బీజీఎం దెబ్బకి, పైగా మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ గెస్ట్ అప్పీయరెన్స్ లు సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచాయి. దీంతో ఈ చిత్రం ఇప్పుడు హిట్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు వెళ్తుందని చెప్పొచ్చు. ఇక మొదటి రోజు కలెక్షన్లు ఆశ్చర్యపరుస్తున్నాయి.
`జైలర్` మూవీ వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ల ఊచకోత ప్రారంభించిందని చెప్పొచ్చు. తమిళనాట, ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా దుమ్ముదులిపేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 90కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఓ మామూలు మూవీ ఈ రేంజ్‌లో కలెక్ట్ చేయడం విశేషంగా చెప్పొచ్చు. ఈ సినిమాకి తమిళనాడులో కంటే ఓవర్సీస్‌లో అత్యధికంగా రావడం మరో విశేషం.
తమిళనాడులో `జైలర్`లో 24(గ్రాస్)కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల వరకు సాధించగా, కర్నాటకలో ఎనిమిదన్నర కోట్లు, కేరళాలో ఐదు కోట్లు దాటింది. నార్త్ లో మాత్రం చాలా డల్‌గా ఉంది. అక్కడ హిందీ సినిమాలున్న నేపథ్యంలో పెద్దగా కలెక్షన్లు రాలేదు. నార్త్ మొత్తంలో రెండు కోట్లు మాత్రమే వచ్చాయి. ఓవర్సీస్‌లో మాత్రం ఒకే రోజు సుమారు ఐదు మిలియిన్లు సాధించింది. దాదాపు 39కోట్లు ఓవర్సీస్‌లో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు 90కోట్లు వసూలు చేసింది.
సెకండ్ డే కూడా ఈసినిమాకి స్ట్రాంగ్ కలెక్షన్లు ఉండబోతున్నాయని తెలుస్తుంది. మొత్తంగా రజనీ చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని తెలుస్తుంది. సినిమాకి ఈ వీకెండ్ వరకు బాగానే ఉంటాయి. తెలుగులో `భోళాశంకర్`కి రిజల్ట్ తేడాగా ఉండటంతో అది `జైలర్`కి కలిసొచ్చే అంశం. మరి ఈ చిత్రం వీకెండ్ వరకే సందడి చేస్తుందా? ఆ తర్వాత కూడా అలరిస్తుందా? అనేది చూడాలి. మండే నుంచి కూడా కలెక్షన్లు స్టడీగా ఉంటే ఇది ఊహించినట్టే పెద్ద రేంజ్ హిట్ అవుతుంది? లేదంటే సోసోగానే మిగిలిపోతుంది. ఏం జరుగుతుందనేది మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.
ఇక రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తమన్నా చిన్న పాత్రలో మెరవగా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. చాలా కాలం తర్వాత వింటేజ్ రజనీ, ఆయన మార్క్ స్టయిల్, యాక్షన్ సీన్లు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం. అనిరుథ్ రవిచందర్ బీజీఎం సినిమాని నడిపించిందని చెప్పొచ్చు.