సినిమాల విషయంలో వెంకటేష్... ఆ సెంటిమెంట్ పక్కాగా పాటిస్తాడట..

Published : Aug 11, 2023, 05:38 PM IST
సినిమాల విషయంలో వెంకటేష్... ఆ సెంటిమెంట్ పక్కాగా పాటిస్తాడట..

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు... స్టార్ టెక్నీషియన్స్ కాని.. చాలా మందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. కొంత మంది మాత్రం అసలు సెంటిమెంట్స్ పాటించరు. ఈక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ మాత్రం పక్కాగా ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతారట.  అదేంటంటే..? 

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో వెంకటేష్ ఒకరు. నిర్మాత కాబోయి సడెన్ గా హీరో అయ్యాడు వెంకటేష్. అయితే తన కెరీర్ ను తానే నిలబెట్టుకుంటూ..వరుస సినమాల సక్సెస్ తో విక్టరీ తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. వారసుడిగా వచ్చినా.. సొంత టాలెంట్ తో.. స్టార్ హీరోగా మారిపోయాడు వెంకటేష్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన సినిమాలు మినిమమ్ గ్యారెంటీతో ఆడతాయి. 

ఏజ్ బార్ అవుతున్నా.. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విక్టరీ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్నో సినిమాలు చేశాడు. అయితే వెంక‌టేష్ త‌న ప్ర‌తి సినిమాకు ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతాడట. తన సినిమాలో ఫస్ట్ కాపీని మిస్ అవ్వకుండా నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, మద్రాస్ వడపలలోని కుమారస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిదిలో పూజ చేయిస్తాడ. ఈ విషయం ముందే నిర్మాతలకు చెప్పేస్తాడ వెంకీ. 

ఈ సెంటిమెంట్ తన తండ్రి రామానాయుడు దగ్గర నుంచి వెంకీకి అబ్బినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మిస్ అవ్వకుండా అది ఫాలో అవుతున్నారట వెంకటేష్. అయితే ఈ విషయంలో అఫీషయల్ క్లారిటీ మాత్రం లేదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ విషయం బయటకు వచ్చింది. ఇక  గ‌త ఏడాది ఎఫ్ 3  మూవీతో హిట్ అందుకున్న వెంకటేష్.. రానాతో కలిసి నెట్ ప్లిక్స్ కోసం ఓ రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఇక  ప్ర‌స్తుతం సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. వెంకటేష్‌కు ఇది 75వ సినిమాగా తెరకెక్కుతోంది. 

PREV
click me!

Recommended Stories

సీజన్ 9లో భరణి అన్ అఫీషియల్ విన్నర్, నాగబాబు రెకమండేషన్ ఇలా వర్కౌట్ అయిందా.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్
Karthika Deepam 2 Latest Episode: దీపను బ్రతిమాలిన శ్రీధర్- స్వప్న, కాశీలను కలిపిన కార్తీక్