రజనీకాంత్‌ దీపావళి ట్రీట్‌.. `లాల్‌ సలామ్‌` టీజర్‌కి డేట్‌, టైమ్‌ ఫిక్స్

Published : Nov 10, 2023, 07:24 PM IST
రజనీకాంత్‌ దీపావళి ట్రీట్‌.. `లాల్‌ సలామ్‌` టీజర్‌కి డేట్‌, టైమ్‌ ఫిక్స్

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా వారిని ఖుషీ చేసేందుకు ట్రీట్‌ తెస్తున్నారు. అందుకు డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేశారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల `జైలర్‌`తో దుమ్మురేపాడు. తమిళ చిత్ర పరిశ్రమకి ఇండస్ట్రీ హిట్‌ని అందించాడు. తనకు సరైన మూవీ పడితే ఎలా ఉంటుందో నిరూపించారు. `జైలర్‌` మూవీ ఆరువందల కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. కోలీవుడ్‌ని షేక్‌ చేసింది. ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నారు రజనీ. సంక్రాంతికి ఆయన `లాల్‌ సలామ్‌` అనే మూవీతో సందడి చేయబోతున్నారు. 

అయితే ఈ మూవీని తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ రూపొందించడం విశేషం. ఇందులో రజనీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మోయినుద్దీన్‌ అనే ముంబయి మాఫియా డాన్‌గా సూపర్‌ స్టార్‌ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. విష్ణు విశాల్‌ మెయిన్‌ రోల్‌ చేస్తున్నారు. `బాష` వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత రజనీ ఇలా మాఫియా లీడర్‌ తరహా పాత్ర పోషిస్తుండటం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 

ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కి రజనీ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. `లాల్‌ సలామ్‌` నుంచి దివాళీ ట్రీట్‌ తీసుకురాబోతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నెల 12న ఉదయం పది గంటల 45నిమిషాలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. ఇది నిమిషం 34 సెకన్లు ఉండబోతుందట. సండే రోజు ఫ్యాన్స్ అసలైన పండగ చేసుకునేలా ఈ టీజర్‌ ఉండబోతుందని తెలుస్తుంది. 

ఇక రజనీ కీలక పాత్రలో, విష్ణు విశాల్‌ హీరోగా, విక్రాంత్‌ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న `లాల్‌ సలామ్‌` మూవీని లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తుంది. సంక్రాంతికి గ్రాండ్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. `జైలర్‌` సక్సెస్‌ ఈ మూవీకి కలిసి రాబోతుందని చెప్పొచ్చు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా