తప్పిపోయిన పనిమనిషి కూతురు.. తల్లడిల్లిన సన్నీలియోన్.. ఏం చేసిందంటే?

Published : Nov 10, 2023, 04:51 PM IST
తప్పిపోయిన పనిమనిషి కూతురు.. తల్లడిల్లిన సన్నీలియోన్.. ఏం చేసిందంటే?

సారాంశం

సన్నీలియోన్ చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె పనిమనిషి కూతురు తప్పిపోవడంతో.. సన్నీ తీసుకున్న చొరవకు అంతా మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది.   

అడల్ట్ చిత్రాలను వీడి బాలీవుడ్ నటిగా సన్నీలియోన్ (Sunny Leone)  మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు హిందీలో వరుస చిత్రాలు చేసింది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను కూడా సినిమాలు, టీవీ షోలతో అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సన్నీ లియోన్ గొప్ప మనసును చాటుకుంది. తన పనిమనిషి కూతురు తప్పిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసింది. ఆచూకీ కోసం తనవంతు ప్రయత్నం చేసింది. 

రెండ్రోజుల కిం సన్నీలియోన్ సోషల్  మీడియాలో తన పనిమనిషి కూతురు తప్పిపోయిందని ఓ పోస్ట్ పెట్టింది. తొమ్మిదేళ్ల  బాలిక, పేరు అనుష్క కిరణ్ మోర్ అని తెలిపింది. అదే రోజు సాయంత్రం తప్పిపోయిందని ఆచూకీ తెలిపినా, చిన్నారిని క్షేమంగా తమ ఇంట్లో దింపినా ప్రోత్సాహకంగా రూ.50 వేలు అందిస్తానని ప్రకటించింది. అలాగే ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పలు స్థానిక సంఘాలకు విషయాన్ని తెలియజేసింది. 

ఈ క్రమంలో తాజాగా మరోపోస్ట్ పెట్టింది. చిన్నారి దొరికిందని, తమ కుటుంబం వద్దకు చేరుకుందని తెలిపింది. దేవుడు గొప్పవాడని, బాలికను వెతికేందుకు తనతో పాటు ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. 24 గంటల్లో బాలిక ఇంటికి తిరిగి వచ్చిందని తెలిపింది. ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె మంచి  మనసుకు నెటిజన్లు అభినందిస్తున్నారు. 

ఇక సన్నీలియోన్ తెలుగులోనూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ‘కరెంట్ తీగ’, ‘పీఎస్ వీ గురుడవేగ’, ‘జిన్నా’ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం తొలిసారి తెలుగు టెలివిజన్ కు ఎంట్రీ ఇచ్చింది. ‘తెలుగు మీడియం ఇస్కూల్’ గేమ్ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ అలరిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?