ఒకే ఫ్రేమ్ లో రజనీకాంత్, కపిల్ దేవ్.. ఎక్కడ, ఎందుకు కలిశారు? వైరల్ ఫొటో

By Asianet News  |  First Published May 18, 2023, 10:44 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఓకే ఫ్రెమ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఎందుకు కలుసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.
 


సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. మరోవైపు ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’ (Lal Salaam)లోనూ రజనీ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈచిత్రం నుంచి తలైవా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా రజనీకాంత్ పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. రజనీ, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటోను సూపర్ స్టార్ ట్వీటర్ వేదికన షేర్ చేశారు. వీరద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటం పట్ల ఇటు సినీ అభిమానులు, అటు క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే వీరిద్దరూ ఎందుకు, ఎక్కడ కలిశారనేది ఆసక్తికరంగా మారింది. ‘లాల్ సలామ్’ సెట్స్ లోనే కలిశారని తెలుస్తోంది. 

Latest Videos

అయితే రజినీ ట్వీట్ చేస్తూ.. ‘క్రికెట్ లో భారతదేశానికి తొలిసారిగా ప్రపంచ కప్ తీసుకొచ్చిన లెజెండ్ తో కలిసి పనిచేయడం గౌరవంగా ఉంది’ అంటూ పేర్కొన్నారు. దీంతో కపిల్ కూడా ఈచిత్రంలో నటిస్తున్నారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరికొందరు మాత్రం కపిల్ శర్మకు సంబంధించిన పాత్రలో రజినీ నటిస్తున్నారేమోనని అంటున్నారు. దీనిపై మున్ముందు క్లారిటీ రానుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. 

రజినీకాంత్ మొయిదీన్ భాయ్ పాత్రలో నటిస్తుండగా హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.  లైకా సంస్థ నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామస్వామి సినిమాటోగ్రఫీగా బాధ్యతలు చూస్తున్నారు. ఇక రజనీకాంత్ హీరోగా ‘జైలర్’రూపుదిద్దుకుంటోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

It is my honour and privilege working with the Legendary, most respected and wonderful human being Kapildevji., who made India proud winning for the first time ever..Cricket World Cup!!! pic.twitter.com/OUvUtQXjoQ

— Rajinikanth (@rajinikanth)
click me!