కేక పెట్టించేలా సూపర్ స్టార్ లుక్.. భార్యతో రొమాంటిక్ గా!

Published : Sep 30, 2019, 08:07 PM IST
కేక పెట్టించేలా సూపర్ స్టార్ లుక్.. భార్యతో రొమాంటిక్ గా!

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. సంక్రాంతికి సందడి చేయబోతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. 

రజనీకాంత్ ఈ ఏడాది పేట చిత్రంతో సందడి చేశాడు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ లో రజనీ పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

తరచుగా షూటింగ్ లొకేషన్స్ లోని పిక్స్ కొన్ని లీకవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ దర్బార్ షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. పోలీస్ డ్రెస్ లో రజనీ అదిరిపోయే లుక్ లో కూర్చుని ఉండగా.. తన భర్త భుజాలపై చేతులు వేసి ఫొటోకు పోజిచ్చారు లతా. ఈ రొమాంటిక్ పిక్ ప్రస్తుతం నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రంలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సర్కార్ లాంటి భారీ హిట్ తర్వాత మురుగదాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దర్బార్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 24: విశ్వక్‌ను చితక్కొట్టిన ధీరజ్, కోపంతో భర్తను కొట్టిన ప్రేమ
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?