భల్లాల దేవుడికి థాంక్స్ చెప్పిన రాంచరణ్.. ఎందుకో తెలుసా!

By tirumala ANFirst Published Sep 30, 2019, 7:40 PM IST
Highlights

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు ప్రాంతానికి  చెందిన తొలి తెలుగు స్వాతంత్ర ఉద్యమ వీరుడు. ఉయ్యాలవాడ చరిత్ర మరచిన వీరుడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఉయ్యాలవాడ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రం తెరకెక్కింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా నరసింహారెడ్డి చరిత్రని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లందుకు సైరా టీం ప్రయత్నిస్తోంది. 

తాము అమర్ చిత్ర కథ సంస్థతో చేతులు కలిపినట్లు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఇదివరకే ప్రకటించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని పుస్తక రూపంలోకి తీసుకొస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. అమర్ చిత్ర కథ సంస్థ ఎన్నో దశాబ్దాలుగా భారతీయ పురాణాలు, చరిత్ర, జానపద కథలని బొమ్మల రూపంలో అందిస్తోంది. 

అమర్ చిత్ర కథ సంస్థ ఉయ్యాలవాడ జీవిత చరిత్రని 'నరసింహారెడ్డి - ది లయన్ ఆఫ్ రాయలసీమ' అనే టైటిల్ తో పుస్తకాలని మార్కెట్ లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన కాపీలు సిద్ధం అయ్యాయి. ఈ విషయాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. 

తాము అమర్ చిత్ర కథ సంస్థతో చేతులు కలపడంలో సాయం చేసిన భల్లాలదేవుడు రానాకి చరణ్ కృతజ్ఞతలు తెలిపాడు. 

 

It's so exciting to be associated with and to see our film turn into a comic! And a huge thank to for making this happen!!
Find it at a bookstore near you... pic.twitter.com/2xBJF47IMt

— Konidela Pro Company (@KonidelaPro)
click me!