'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?

Published : Oct 02, 2018, 12:20 PM IST
'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముందుగా బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు అతిథులుగా వస్తారనే ప్రచారం జరిగింది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముందుగా బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు అతిథులుగా వస్తారనే ప్రచారం జరిగింది. ఈ మేరకు చిత్రబృందం కూడా బాలకృష్ణ అతిథిగా రాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

దీంతో చాలా కాలం తరువాత బాబాయ్-అబ్బాయ్ లను ఒకే స్టేజ్ పై చూడబోతున్నామని అభిమానులు ఆశించారు. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఓ ట్వీట్ బాలకృష్ణ ఈ ఈవెంట్ ని మిస్ చేస్తున్నాడనే సందేహాలను కలిగించింది. సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఎన్టీఆర్ విడుదల చేస్తారని చిత్రయూనిట్ వెల్లడించింది. అతిథిగా బాలయ్య వస్తే ఎన్టీఆర్ తో ట్రైలర్ రిలీజ్ చేయడమేంటనే సందేహాలు నెలకొన్నాయి.

ఆ సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ మరోవార్త హల్చల్ చేస్తోంది. స్వర్గీయ నందమూరి తరకరామావు రావు విగ్రహావిష్కరణ కోసం బాలయ్య ఖమ్మం జిల్లాకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన 'అరవింద సమేత' ఈవెంట్ కి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.

అదే గనుక జరిగితే కేవలం చిత్రబృందం, అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ జరిగిపోతుందని తెలుస్తోంది. హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో ఆయన స్టేజ్ మీద ఏం మాట్లాడతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

అరవింద సమేత.. అసలు కాన్సెప్ట్ ఇదేనట?

PREV
click me!

Recommended Stories

Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?