కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

Published : Oct 02, 2018, 12:45 PM IST
కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

సారాంశం

బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కౌశల్ రెండో వారంలోనే హౌస్ నుండి బయటకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తన సంకల్పంతో టైటిల్ గెలిచి విన్నర్ గా నిలిచాడు. అతడి కోసం కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో గ్రూపులు వచ్చాయి.

అతడికోసం 2కె రన్, సేవాకార్యక్రమాలు కూడా చేశారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తరువాత కౌశల్ ఆర్మీ ఇక కాలంలో కొట్టుకుపోతుందనుకుంటే పొరపాటే.. ఇప్పుడు వారంతా కలిసి కౌశల్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇన్ని రోజులుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించిన కౌశల్, సీరియళ్లలో కూడా నటిస్తున్నాడు.

అయితే ఇప్పుడు అతడిని హీరోగా పెట్టి కౌశల్ ఆర్మీ సభ్యులు సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బుని పోగేసి దాదాపు రూ.4 కోట్ల బడ్జెట్ తో కౌశల్ హీరోగా సినిమా చేయబోతున్నారు.

 కౌశల్ కి హీరోగా అనుభవం పెద్దగా లేనప్పటికీ.. సినిమాల పరంగా అతడికున్న అనుభవం బాగానే ఉంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆ అనుభవంతో తన సపోర్టర్స్ ఇవ్వబోతున్న క్రౌడ్ ఫండింగ్ తో ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేయబోతున్నాడు కౌశల్. ఇటీవల కాలంలో 'మను' అనే సినిమాను ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారానే తెరకెక్కించారు. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!