Rajendra Prasad Senapathi: ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న రాజేంద్ర ప్రసాద్.. కొత్త అవతారంలో నటకిరీటి.

Published : Dec 12, 2021, 12:50 PM ISTUpdated : Dec 12, 2021, 02:11 PM IST
Rajendra Prasad Senapathi: ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న రాజేంద్ర ప్రసాద్.. కొత్త అవతారంలో నటకిరీటి.

సారాంశం

 ‘సేనాప‌తి’ (Senapathi) క్రైమ్ డ్రామా సిరీస్‌తో ఫస్ట్ టైమ్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు న‌ట కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌(Rajendra Prasad). ఈ సిరీస్ ను మెగాడాటర్ నిర్మిస్తుండటం విశేషం.  

45 ఏళ్ళకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటకిరీటి Rajendra Prasad. హీరోగా.. కమెడియన్ గా.. కామెడీ హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..ఫాదర్ గా.. బ్రదర్ గా.. ఇలా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. ఆఖరుకి లేడీ గెటప్ చేయడానికి కూడా వెనకాడలేదాయన. మేడం సినిమాలో లేడీ గెటప్ తో అలరించారు. ఇప్పటి వరకూ రకరకాల పాత్రలతో మెప్పించి ఈ స్టార్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫస్ట్ టైమ్ వెబ్ సిరీస్ తో మన ముందకు రాబోతున్నారు. అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నారు నటకిరీటి.  


రాజేంద్ర ప్రసాద్ నటించిన రిడెంప్ష‌న్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ "సేనాపతి". త్వరలో ఈ వెబ్ సిరీస్  ఫస్ట్ తెలుగు ఓటీటీ  ప్లాట్ ఫామ్ "ఆహా"లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రేమ ఇష్క్ కాద‌ల్ వంటి సినిమాలను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ఈ మూవీని డైరెక్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై "మెగాస్టార్ చిరంజీవి" కుమార్తె సుష్మిత కొణిదెల మరియు విష్ణు ప్ర‌సాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటు న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వ‌ర్ కందేర్గుల‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ ప్లే చేశారు.  


ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ‘సేనాప‌తి’ సిరీస్ మోష‌న్ పోస్ట‌ర్‌ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ రోజు (ఆదివారం) రిలీజ్ చేశారు. ఓ తాత‌య్య త‌న మ‌న‌వ‌డితో మాట్లాడుతున్న‌ట్లు మోష‌న్ పోస్ట‌ర్ కొత్తగా డిజైన్ చేశారు టీమ్. ఓ రాజు..ఆయ‌న ఏడుగురు కొడుకులు చేపల వేట‌కి వెళతారు. దానికి  సంబంధించిన క‌థ‌ను రైతు చెప్ప‌డంతో మోష‌న్ పోస్ట‌ర్ ప్రారంభం అవుతుంది. రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పే క‌థ‌నం ఓ ఇన్‌టెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. 

Also Read : RRR: ఆ భాష ఒక్కటే ఇబ్బంది పెట్టింది... కూనీ చేస్తున్నామేమో అనిపించిందన్న తారక్...


జిగ్‌సా పజిల్ లో ఉండే అంశాల‌న్ని క‌లిసి ఓ వాస్త‌విక రూపానికి వస్తే ఎలా ఉంటుందో... అలాగే ఈ సిరీస్ కూడా ఉండ‌బోతుంద‌ని.. మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్‌. ఇందులో రాజేంద్ర ప‌సాద్ ముఖంపై క‌న‌ప‌డుతున్న తుపాకీ ఎవ‌రిది..? ఎందుకు చూపిస్తున్నార‌నేది ఆస‌క్తిని క‌లిగిస్తుంది. టోటల్ గా రాజేంద్ర ప్రసాద్ ఇంతకు ముందెన్నడు కనిపించని  డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు మాత్రం ఈ మోషన్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

 

సాధార‌ణంగా రాజేంద్ర ప్ర‌సాద్ పేరు చెబితే చాలా పాత్రలు మన ముందు కదులుతాయి.అయితే.. ఈ  సేనాప‌తి సిరీస్‌లో మూర్తి అనే ఇంట్రెస్టింగ్..అండ్ సీరియ‌స్ క్యారెక్టర్ లో రాజేంద్ర ప్ర‌సాద్ క‌నిపించ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు బ‌ల‌మైన పాత్ర‌ల్లో మిగతా ఆర్టిస్ట్ లు అలరించబోతున్నారు. యూత్, అనుభ‌వం ఉన్న‌ఆర్టిస్ట్ ల కాంబినేష‌న్‌లో రూపొందిన సేనాప‌తి సిరీస్..  టైట్ స్క్రీన్ ప్లే, ప‌వ‌ర్ ప్యాక్డ్ నెరేష‌న్‌, షార్ప్ పెర్ఫామెన్‌సెస్‌, యూనిక్ ప్లాట్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే సేనాప‌తి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది మాత్రం ఇంకా అనౌస్స్ చేయలేదు. త్వరలో స్ట్రీమింగ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. 

Also Read : Simbu Hospitalized : హాస్పిటల్ లో హీరో శింబు.. ఆందోళనలో అభిమానులు...
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌