Bheemla Nayak: ఆత్మను చంపేశారు... ఫలితం ఎలా ఉంటుందో

Published : Dec 12, 2021, 12:23 PM IST
Bheemla Nayak: ఆత్మను చంపేశారు... ఫలితం ఎలా ఉంటుందో

సారాంశం

భీమ్లా నాయక్ మూవీలో హీరోగా పవన్ Pawan Kalayan) నటిస్తున్న నేపథ్యంలో కథను మార్చకున్నప్పటికీ హంగులు, ఆర్భాటాలు అద్దారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పరిమితికి మించిన మార్పులు చేశారు. 

ఎవరెన్ని చెప్పినా తగ్గేది లేదు. సంక్రాంతి బరిలో దిగిపోతున్నాం అంటూ భీమ్లా నాయక్ (Bheemla Nayak) నిర్మాతలు తేల్చి చెప్పేశారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ పలు మార్లు ట్విట్టర్ పోస్ట్స్ ద్వారా మీడియా పుకార్లకు చెక్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ఎంతగా బ్రతిమిలాడుకున్నా.. ససేమిరా అంటూ జనవరి 12న భీమ్లా నాయక్ విడుదల చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. కాగా భీమ్లా నాయక్ మూవీ విజయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ ఇమేజ్ కోసం భీమ్లా నాయక్ కథను కిచిడీ చేశారన్న పుకార్లు చక్కర్లు కొడుతుండగా... సినిమా ఎలా ఉంటుందనే సందేహాలు తలెత్తుతున్నాయి.  


భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్. మలయాళంలో ఈ మూవీ ఓ సంచలనం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆత్మ గౌరవం, ఇగో అనే అంశాలను ప్రధానంగా తీసుకొని తెరకెక్కిన చిత్రం. ఓ సున్నితమైన అంశాన్ని దివంగత దర్శకుడు  సాచి అద్బుతంగా తెరకెక్కించారు. కథలో హీరోయిజం ఎక్కడా కనిపించకుండా.. సహజంగా రెండు పాత్రల మధ్య సాగే సంఘర్షణగా అయ్యప్పనుమ్ కోశియుమ్ ఉంటుంది. 


భీమ్లా నాయక్ మూవీలో హీరోగా పవన్ Pawan Kalayan) నటిస్తున్న నేపథ్యంలో కథను మార్చకున్నప్పటికీ హంగులు, ఆర్భాటాలు అద్దారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పరిమితికి మించిన మార్పులు చేశారు. భీమ్లా నాయక్ అంటూ పవన్ క్యారెక్టర్ నేమ్ ని టైటిల్ గా నిర్ణయించడంతోనే సినిమా అంత పవన్ షోగా ఉంటుందన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చారు. ప్రోమోలు చూశాక పూర్తిగా స్పష్టత వచ్చింది. దీంతో రానాను పూర్తిగా విలన్ గా చూపించి, పవన్ ని హీరోని చేసి ఉండొచ్చని కొందరి భావన. 

Also read RRR Movie: టికెట్ ధరల కోసం ఎన్టీఆర్ హెల్ప్ తీసుకుంటున్న దానయ్య.. ఎందుకో తెలుసా ?

అలాగే ఫైట్స్, ఎలివేషన్స్ కోసం ప్రత్యేకంగా సన్నివేశాలు, డైలాగ్స్ జొప్పించారు. దీనివల్ల అయ్యప్పనుమ్ కోశియుమ్ అసలు కథలోని ఆత్మను చంపేశారన్న టాక్ వినిపిస్తుంది. నటుల ఇమేజ్ తో సంబంధం లేకుండా కథ ప్రధానంగా తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ ప్రేక్షకులకు రుచిస్తుందా లేదా అనేది సందేహమే. అయితే పింక్ లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కోర్ట్ రూమ్  డ్రామాకే హంగులు అద్ది, హిట్ టాక్ తెచ్చుకున్నారు. కాబట్టి భీమ్లా నాయక్... కూడా అదే తరహా పవన్ ఫ్యాన్స్ కి నచ్చేలా చిత్రీకరించి ఉండవచ్చు. 

Also read Vakeel Saab:ట్రెండింగ్ లో ‘వకీల్ సాబ్’,మరో రికార్డ్
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే