`చెక్‌మేట్`‌గా నట కిరీటి.. ట్రైలర్‌ రిలీజ్ చేసిన వినాయక్‌

By Satish ReddyFirst Published Jul 29, 2020, 3:11 PM IST
Highlights

డాక్టర్ రాజేంద్రప్రసాద్, సందీప్, విష్ణుప్రియ,  దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా చెక్‌ మేట్‌. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాత గా తెరకెక్కించిన సినిమా చెక్ మేట్. డాక్టర్ రాజేంద్రప్రసాద్, సందీప్, విష్ణుప్రియ,  దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకులు వివి.వినాయక్ మాట్లాడుతూ... `సినిమా ట్రైలర్ చాలా బాగుంది. నేటి యువత అభిరుచులకు అద్దం పడుతూ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలతో సినిమా వుంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, రఘు బాబు, కృష్ణ భగవాన్ వంటి సీనియర్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకుడు ప్రసాద్ నాకు మంచి మిత్రుడు. అతను చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను` అన్నారు.

దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి మాట్లాడుతూ... `నేటి సమాజంలో యూత్ ముఖ్యంగా లేడీస్ వాళ్లకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఆ సమస్య ను పరిష్కరించు కోలేక ఆ సమస్యను ఎవరికి చెప్పుకోలేక అత్మ హత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను ధైర్యంగా పరిష్కరించుకోవాలి అనే పాయింట్ తో నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను వాళ్ళు ఎలా ధైర్యం గా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాము.

రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు మిగతా అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. సినిమా అందరికీ నచ్చే విధంగా భారీ స్టార్ కాస్ట్ తో, మలేషియా సింగపూర్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తెరకెక్కించాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం ట్రైలర్ రిలీజ్ చేసి మా చిత్రాన్ని తన సినిమాగా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న వినాయక్ గారికి ధన్యవాదములు` అని అన్నారు.

click me!