విద్యా బాలన్ భావోద్వేగ కవిత.. రిలీజ్‌కు రెడీ అయిన శకుంతలా దేవి

Published : Jul 29, 2020, 01:54 PM IST
విద్యా బాలన్ భావోద్వేగ కవిత.. రిలీజ్‌కు రెడీ అయిన శకుంతలా దేవి

సారాంశం

శకుంతల దేవి ఓ గణిత మేదావిగానే కాదు ఓ ఎఫెక్షనేట్‌ మదర్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా విద్యా బాలన్‌ ఓ భావోద్వేగ కవితను దేశలోని ఆడపిల్లలకు అంకితం చేశారు.

ప్రతి తల్లీ, కూతురు మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక విలువైన స్నేహం మరియు అనిర్వచనీయ ప్రేమ ఆ ఇద్దరి మధ్య బంధాన్ని కొలమానం అంటూ ఉండదు. శకుంతల దేవి ఓ గణిత మేదావిగానే కాదు ఓ ఎఫెక్షనేట్‌ మదర్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా విద్యా బాలన్‌ ఓ భావోద్వేగ కవితను దేశలోని ఆడపిల్లలకు అంకితం చేశారు.

ప్రపంచ మహిళలంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ అభివృద్ధిచెందాలి. ఈ వీడియో ప్రతీ మహిళకు ఉండే ఓ అద్భుతమైన బంధం అమ్మకు అంకితం. ఈ వీడియోను మోనోక్రోమ్‌లో షూట్‌ చేశారు. విద్యా బాలన్‌ ప్రతీ తల్లి కూడా ఒకప్పుడు కూతురే అన్న విషయాన్ని అద్భుతంగా వివరించారు. ప్రతి అమ్మాయి నిర్భయంగా ఉండటానికి, అన్ని బంధనాలను తెంచుకోవడానికి మరీ ముఖ్యంగా వారు కలలుగన్న వాటిని సాధించడానికి తమను తాము నమ్ముతారని వివరించింది విద్యా.

ప్రతీ స్త్రీ తనలోని శక్తిని తాను గుర్తించాలని ఈ వీడియోలో బలంగా వినిపించేలా చెపుతుంది విద్యా. ప్రగతి శీల భావాలున్న ముందుతరం మహిళ పాత్రలో నటించిన విద్యా బాలన్‌ తెరపై అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ