Sekhar: కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి...అప్పులు తీరుతాయా?

Surya Prakash   | Asianet News
Published : May 22, 2022, 03:08 PM IST
Sekhar: కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి...అప్పులు తీరుతాయా?

సారాంశం

సినిమా కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాని చూడటానికి జనం పెద్దగా ఆసక్తి చూపలేదని థియోటర్స్ దగ్గర పలచగా ఉన్న జనం ద్వారా తెలుస్తోంది. 


 యాంగ్రీ మ్యాన్  రాజశేఖర్   గత కొన్నేళ్లుగా హిట్ అనేది తెలియకుండా కెరీర్ ని లాగుసుతున్నారు. తాజాగా శేఖర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమాకి దర్శకురాలిగా తన భార్య జీవిత దర్శకత్వం వహించింది. ఇక ఈ సినిమానే త్రిపుర క్రియేషన్ పతాకంపై శివాని రాజశేఖర్ సుధాకర్ రెడ్డి, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమిక్. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందు విడుదల అయ్యింది.  చిత్రం పర్వాలేదు, ఓ సారి చూడవచ్చు అనిపించుకుంది. 

అయితే  సినిమా కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాని చూడటానికి జనం పెద్దగా ఆసక్తి చూపలేదని థియోటర్స్ దగ్గర పలచగా ఉన్న జనం ద్వారా తెలుస్తోంది. దాంతో ఈ వీకెండ్ అయినా సినిమా నిలబడుతుందా అంటే కష్టమే అనిపిస్తోంది. ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బిజినెస్ పరంగా  జరగలేదు అని ట్రేడ్ టాక్.

ప్రపంచవ్యాప్తంగా టోటల్ బిజినెస్ విషయానికి వస్తే..3.25 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది.  చాలా ఏరియాలలో ఈ చిత్రాన్ని ఓన్ గా రిలీజ్ చేసారు నిర్మాతలు. ఇక ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపుగా రూ 4 కోట్లు అయినా రాబట్టాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం 300 థియేటర్లకు పైగా విడుదలైంది. కానీ కలెక్షన్స్ లేవు.  దాంతో రాజశేఖర్ ఈ సినిమా తో బయట పడతారా లేదా అన్న విషయమై ట్రేడ్ లో చర్చ జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ  ఈరోజు తెలుస్తుంది. ఏది ఏమైనా రాజశేఖర్ ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో ఉన్నాడు.  ఇదిలా ఉండగా...ఈ సినిమా వివాదంలో ఇరుక్కుంది.

ఈ సినిమా కోస‌మ‌ని జీవిత త‌న వ‌ద్ద అప్పుగా తీసుకున్న డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌నందుకు గాను పరంధామ‌రెడ్డి అనే ఫైనాన్షియ‌ర్ కోర్టును ఆశ్ర‌యించారు.  అలాగే 48 గంట‌ల్లోపు రూ.65 ల‌క్ష‌లు సెక్యూరిటీ డిపాజిట్‌గా జీవిత స‌మ‌ర్పించ‌ని ప‌క్షంలో శేఖర్‌ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను ఎటాచ్ చేస్తూ.. ఆ సినిమాను ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా ప‌రంధామ‌రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. దీనిపై రాజ‌శేఖ‌ర్ కానీ, జీవిత కానీ స్పందించలేదు. ఐతే ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన బీరం సుధాక‌ర్ రెడ్డి.. పరంధామ‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌పై రెస్పాండ‌య్యారు.

శేఖర్ సినిమాకు నిర్మాత జీవిత కాద‌ని, తాను అని, త‌న సినిమాకు ఎవ‌రైనా న‌ష్టం క‌లిగిస్తే ఊరుకునేది లేద‌ని సుధాక‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. హీరోగా న‌టించిన రాజ‌శేఖ‌ర్‌కు, ద‌ర్శ‌కురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన జీవిత‌కు తాను పూర్తిగా పారితోష‌కాలు ఇచ్చేశాన‌ని, ఈ సినిమా వాళ్లిద్ద‌రిదీ అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారని, త‌న‌ సినిమాకు వారు నష్టం కలిగిస్తే.. ఏదైనా జరిగితే.. తాను పరువునష్టందావా కేసు వేస్తాన‌ని.. తాను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ల‌ నుంచి రాబడతాన‌ని.. త‌న సినిమాను ఎవ‌రికీ అమ్మ‌కూడ‌ద‌ని ఎలా అంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  

రాజశేఖర్ మాట్లాడుతూ... "శేఖర్ కి ముందు మాకు కొన్ని ప్రాపర్టీస్ ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. ఒకవేళ సినిమా కనుక సరిగా ఆడక పోతే మాకు మిగిలేది కేవలం అప్పులు మాత్రమే. కానీ ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ప్రేక్షకులందరికీ సినిమానీ కచ్చితంగా థియేటర్లలోనే చూడమని నేను విన్నవించుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు రాజశేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసఫ్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే కొద్దిరోజుల ముందే రాజశేఖర్ కి కరోనా సోకింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా