అదే జరిగితే.. రజనీ ‘పేట’డైరక్టర్ సూసైడ్

By Udayavani DhuliFirst Published Jan 4, 2019, 8:41 AM IST
Highlights

యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వయస్సులో చిన్నవాడైనా, ఇప్పటివరకూ చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. 

యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వయస్సులో చిన్నవాడైనా, ఇప్పటివరకూ చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. విమర్శలు ప్రశంసలు అందుకున్న కల్ట్ మూవీస్ ను ఆయన డైరక్ట్ చేసారు.  తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన తో ‘పేట’సినిమా చేసారు. ఈ చిత్రం జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్  మంచి ఊపు అందుకున్నారు. 

ప్రమోషన్ లో భాగంగా తెలుగులో విడుదల చేస్తున్న  వల్లభనేని అశోక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి.  ఈ సినిమాపై దర్శకుడుకు ఉన్న కాన్ఫిడెంట్ గురించి చెప్తూ....సినిమా హిట్ కాకపోతే తను సూసైడ్ చేసుకుంటాను అన్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం కార్తీక్ మూడు సంవత్సరాలు వెయిట్ చేసారు. ఈ సినిమాపై ఆ స్దాయి నమ్మకం ఉందన్నమాట ఆయనకు  తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.   

నిర్మాత మాట్లాడుతూ.... పాతికేళ్లు వెనక్కెళ్లిన రజనీ వేగం, అనిరుధ్ వెర్సటైల్ సంగీతం.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయని అన్నారు. ‘పేట’ రజనీ నెక్స్ట్‌లెవెల్ చిత్రమన్నారు. మంచి సినిమాపై నమ్మకంతో సంక్రాంతికి విడుదల చేస్తున్నామని, ఇప్పటికే 50శాతం బిజినెస్ పూరె్తైందన్నారు. మిగిలిన బిజినెస్ ప్రాసెస్‌లో ఉందని, తెలుగులో స్ట్రయిట్ సినిమా నిర్మాణానికి ఈ ఏడాది ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కథలు వింటున్నామని, మంచి కథ, హీరో దొరకితే వెంటనే ప్రకటిస్తామన్నారు.

సన్‌పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తోంది. త్రిష, సిమ్రన్‌ ఇందులో హీరోయిన్స్ గా కనిపించనున్నారు. విజయ్ ‌సేతుపతి, మేఘా ఆకాశ్‌, బాబి సింహా, శశికుమార్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికేట్  ఇచ్చింది.  ‘పేట’ను వివిధ భాషల్లోనూ విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. 

'పేటా' తెలుగు ట్రైలర్!

click me!