ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఫ్రెండ్‌షిప్‌ డే ట్రీట్‌.. జక్కన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్లాన్‌ ఇదేనా?

Published : Jul 14, 2021, 08:11 AM IST
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఫ్రెండ్‌షిప్‌ డే ట్రీట్‌.. జక్కన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్లాన్‌ ఇదేనా?

సారాంశం

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ల మధ్య ఈ స్నేహం పలు సందర్బాల్లో కనిపిస్తుంటుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్న నేపథ్యంలో వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ మరింత బలపడింది. 

దర్శకధీరుడు రాజమౌళి తన హీరోలకు మంచి గిఫ్ట్ ని ప్లాన్ చేశాడట. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వాలని భావిస్తున్నారట. అది చూసి కొమురంభీమ్‌, అల్లూరిలు కచ్చితంగా సర్ ప్రైజ్‌ అవుతారని చెబుతున్నారు. మరి జక్కన్న ఏం చేయబోతున్నాడంటే.. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్నేహాన్ని ప్రతిబింబించేలా ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేయబోతున్నారని సమాచారం. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ల మధ్య ఈ స్నేహం పలు పార్టీల్లో, ఇతర సందర్బాల్లో కనిపిస్తుంటుంది. ఎన్టీఆర్‌, చెర్రీ ఇప్పుడు కలిసి `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్న నేపథ్యంలో వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ మరింత బలపడింది. తెల్లదొరలపై పోరాడే క్రమంలో ఇద్దరూ స్నేహితులుగా కనిపించనున్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరూ తలపడే సన్నివేశాలూ ఉన్నాయి. వాటిని తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని, కంటతడి పెడతారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో వెల్లడించిన విషయం విధితమే. దాన్ని ప్రత్యక్షంగా చూసిన రాజమౌళి వీరి స్నేహాన్ని ఓ వీడియోలో బంధించి విడుదల చేయబోతున్నారు. స్నేహితుల రోజు సందర్భంగా ఆగస్ట్ 1న(ఆదివారం) ఈ వీడియోని రిలీజ్‌ చేసేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే దీనిపై జక్కన టీమ్‌ ఫోకస్‌ పెట్టిందట. 

ఇదిలా ఉంటే ఈ నెల 15న `రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌` పేరుతో మేకింగ్‌ వీడియోని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ట్రీట్‌ రాక చాలా రోజులవుతుంది. దీంతో కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మళ్లీ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేయడానికి రాజమౌళి మేకింగ్‌ వీడియోని ప్లాన్‌ చేశారు. దీంతోపాటు ఆగస్ట్ 1న ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఎన్టీఆర్‌, చెర్రీల వీడియోని విడుదల చేస్తారట. ఇదే నిజమైతే ఇక ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయం. వారిద్దరి అభిమానుల మధ్య కూడా బాండ్‌ మరింత బలపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన అలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోర్రీస్‌ నటిస్తున్నారు. వీరితోపాటు సముద్రఖని, అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ ని పూర్తి చేసుకుని రెండు సాంగ్‌లను చిత్రీకరించుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 13న దసరా కానుకగా దాదాపు పదిభాషల్లో భారీగా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది