
హెచ్ఎండీఏ నిబంధనలు అతిక్రమించిన కేసులో జయభేరీ సంస్థ అధినేత, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్‌లో జయభేరీ సంస్ధ నుంచి ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్ విషయంలో జయభేరీ సంస్థ అనేక అవకతవకలకు పాల్పడిందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు మధుసూదన్. ఈ కేసులో కొనుగోలుదారుడికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు చెప్పింది.