ప్రఖ్యాత పారిస్ విఎఫ్ఎక్స్ స్టూడియోలో రాజమౌళి... మహేష్ మూవీపై పెరుగుతున్న అంచనాలు!

By Sambi ReddyFirst Published Jun 29, 2022, 10:41 AM IST
Highlights


దర్శకుడు రాజమౌళి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్లున్నారు. పారిస్ వెళ్లిన రాజమౌళి ఫేమస్ విఎఫ్ఎక్స్ స్టూడియోని సందర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. 

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మూవీతో రాజమౌళి రికార్డుల మోత మోగించారు. తన సినిమాల రికార్డ్స్ తానే బ్రేక్ చేయాలని నిరూపించారు. వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆర్ ఆర్ ఆర్ ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ రాబట్టారు. యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ రీరిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా అమెరికన్ ప్రేక్షకులు, ప్రముఖులు సినిమాను ప్రత్యేకంగా కొనియాడారు. ఇక ఓటీటీలో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి భారీ ఆదరణ దక్కింది. 

ఇక ఆర్ ఆర్ ఆర్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజమౌళి(Rajamouli) మహేష్ మూవీ కోసం సిద్దమవుతున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేష్ తో మూవీ చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే కన్ఫర్మ్ చేశారు. మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఇక మహేష్ కోసం ఆఫ్రికన్ జంగిల్స్ నేపథ్యంలో యాక్షన్ అండ్ అడ్వెంచర్ జోనర్ ఎంచుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

ఆర్ ఆర్ ఆర్ కి మించి భారీ బడ్జెట్ తో మరింత అత్యున్నత ప్రమాణాలతో మహేష్ మూవీ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఆయన తాజాగా పారిస్ వెళ్లడం ఈ కథనాలకు బలం చేకూర్చుతుంది. రాజమౌళి తన మిత్రుడు శోభు యార్లగడ్డతో పాటు పారిస్ లో కాగా యూనిట్ ఇమేజ్ అనే విఎఫ్ఎక్స్, 3డి యానిమేషన్ స్టూడియోని సందర్శించారు. ఆ సంస్థ కో ఫౌండర్స్ తో ఆయన భేటీ అయ్యారు. రాజమౌళి తన ప్రాజెక్ట్ కి సంబంధించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. 

Visited in Paris, with & Kamal Kannan. Had very interesting discussions with co-founders Maxime Leure & Remi ! Thanks a lot Max for taking timeoff and patiently answering all our questions. Looking forward to working together on some exciting work… pic.twitter.com/tFO93r3YX8

— rajamouli ss (@ssrajamouli)

రాజమౌళి తన ట్వీట్ లో... కమల్ కణ్ణన్, శోభు యార్లగడ్డతో పాటు పారిస్ లో గల యూనిట్ ఇమేజ్ విఎఫ్ఎక్స్ స్టూడియోని సందర్శించడం జరిగింది. ఈ స్టూడియో కో ఫౌండర్స్ గా ఉన్న మాక్సిమ్ లారే, రెమి లను కలవడం జరిగింది. వాళ్ళను అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాము. మా ప్రశ్నలకు వారు సహనంగా తమ విలువైన సమయం కేటాయించి సమాధానాలు చెప్పారు. భవిష్యత్తులో వారితో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను... అని కామెంట్ చేశారు. యూనిట్ ఇమేజ్ స్టూడియోతో వర్క్ చేయనున్నట్లు రాజమౌళి కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో మహేష్ మూవీ కోసమే కావచ్చనిపిస్తుంది. 

ఈ క్రమంలో మహేష్ (Mahesh Babu)మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు రాజమౌళి మొదలుపెట్టారని తెలుస్తుంది. 2023లో రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే సూచనలు కలవు. ఈ లోపు మహేష్ త్రివిక్రమ్ మూవీ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మొదలుకావాల్సి ఉండగా ఎందుకో ఆలస్యం అవుతుంది. 

click me!