
Actress Meena Husband Vidyasagar Passes Away: దక్షిణాది చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. చెన్నైలోకి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం అందింది. వివరాల్లోకి వెళితే.. మీనా భర్త విద్యాసాగర్.. గత కొంతకాలంగా పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడు తున్నారు. దీంతో ఆయనను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు వైద్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే... ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనను రక్షించడానికి వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ... మరోసారి కరోనా సోకడంతో విద్యాసాగర్‌ను రక్షించలేకపోయారని సమాచారం.
ఆస్పత్రి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. నటి మీనా భర్త విద్యాసాగర్ గత కొన్నేండ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆయన కరోనా బారిన పడ్డారు. చిక్సిత అనంతరం కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం మాత్రం క్షీణించింది. ఊపిరితిత్తుల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఊపిరితిత్తులను మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఆస్పత్రితో చికిత్స తీసుకుంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కానీ, ఆయనక తగిన ఊపిరితిత్తులు దొరకలేదు. లంగ్స్ ట్రాన్స్‌ప్లంటేషన్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈ క్రమంలో రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించిన విద్యాసాగర్ మంగళవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు.
విద్యాసాగర్ మరణవార్తతో మీనా కుటుంబంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
విద్యాసాగర్ ది బెంగళూరు. ఆయన వ్యాపారవేత్త. ఆయన 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప. పేరు నైనిక. 'తెరి' (తెలుగులో 'పోలీస్') లో తమిళ స్టార్ హీరో విజయ్ కుమార్తె పాత్రలో నటించింది. మీనా దక్షిణాది పలువురు అగ్ర హీరోల హీరోల సరసన పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో ఈ ఏడాది విడుదలైన 'సన్ ఆఫ్ ఇండియా'లో మోహన్ బాబు భార్యగా, గత ఏడాది ఓటీటీలో విడుదలైన 'దృశ్యం 2'లో వెంకటేష్ భార్య పాత్రలో మీనా కనిపించారు.