రాజమౌళి మహాభారతం ఐదు పార్ట్ లు, త్వరలో ప్రారంభం

Published : Sep 16, 2017, 07:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రాజమౌళి మహాభారతం ఐదు పార్ట్ లు, త్వరలో ప్రారంభం

సారాంశం

రాజమౌళి మహాభారతం గురించి గతంలో తెగ రూమర్స్ బాహుబలి ప్రాజెక్ట్ అయిపోగానే మహాభారతమే అంటూ వార్తలు మహాభారతం త్వరలో మొదలవుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ప్రాజెక్టు గురించి ఇటీవల జోరుగా చర్చిస్తున్నామన్న విజయేంద్ర ప్రసాద్

రాజ‌మౌళి బాహుబ‌లి సినిమా త‌ర్వాత మ‌హాభార‌తం సినిమా తీయ‌నున్నాడ‌నే వార్త బాహుబలి రిలీజ్ కాకముందు నుంచే జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. చాలా సార్లు రాజ‌మౌళి కూడా మ‌హాభారతం సినిమా గురించి చెప్పినా.. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాడ‌నేది చెప్ప‌లేదు. 2026 వ‌ర‌కు మ‌హాభారతం గురించి ఆలోచించ‌ను అని కూడా మ‌రో ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి చెప్పాడు.

అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో గుప్పుమంటున్న మ‌రో వార్త ఏంటంటే.. రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభార‌తాన్ని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడ‌ని టాక్. అంతే కాదు.. వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. ఇండియాలో ఉన్న ఫిలిం ఇండ‌స్ట్రీల‌లో ఉన్న న‌టులంద‌రూ ఈ మూవీలో న‌టించనున్న‌ట్లు స‌మాచారం. ఇక‌.. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభారతాన్ని జ‌క్క‌న్న ఐదు పార్టులుగా తీయ‌నున్నాడ‌ట‌. 

బాహుబ‌లి మూవీని రెండు పార్టులుగా తీయ‌డానికే క‌నీసం ఐదు సంవ‌త్స‌రాల స‌మ‌యం తీసుకున్న జ‌క్క‌న్న మ‌రి.. మ‌హాభార‌తం ఐదు పార్టుల‌కు ఎన్ని సంవ‌త్స‌రాలు తీసుకుంటాడోన‌ని ఇండ‌స్ట్రీ కోడై కూస్తున్న‌ది. అయితే.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూ లో రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ... "మ‌హాభారతం తీయ‌డానికి రాజ‌మౌళి బాహుబ‌లికి తీసుకున్నంత స‌మ‌యం తీసుకోక‌పోవ‌చ్చు. త్వ‌ర‌లోనే మూవీ ప్రారంభ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే మ‌హాభారతం స్టోరీ గురించి ఓసారి ఇద్ద‌రం క‌లిసి డిస్క‌స్ చేశాం. ఐదు పార్టుల్లో మాత్రం ఈ మూవీ ఉంటుంది" అని ఆయ‌న చెప్పారు. 

అయితే.. ఈ భారీ ప్రాజెక్టు ఎప్పుడు ప‌ట్టాల‌కెక్కుతుంది, ఎవ‌రెవ‌రు న‌టిస్తారు, ఎవ‌రు నిర్మిస్తారు. లాంటి విష‌యాల‌పై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు అభిమానుల‌కు ఓ క్లారిటీ లేదు. 

ఇక..రూ. 1000 కోట్ల బ‌డ్జెట్ తో మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఓ మ‌ల‌యాళం డైరెక్ట‌ర్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్