ఎస్వీ రంగారావుగా.. మోహన్ బాబు

Published : Sep 16, 2017, 05:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఎస్వీ రంగారావుగా.. మోహన్ బాబు

సారాంశం

సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానటి కీలక పాత్రలో మోహన్ బాబు

అలనాటి లెజండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’.  ఈ సినిమా పేరు ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి  చిత్ర నటీనటుల విషయంలోనూ దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ నాటి తారలంతా ఈ కాలం తారల రూపంలో మహానటి సినిమాలో కనువిందు చేయనున్నారు.

 

ఈ చిత్రంలో లీడ్ రోల్ కీర్తి సురేష్ పోషిస్తుండగా, ప్రకాష్ రాజ్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ, షాలిని, ప్రగ్యాజైశ్వాల్ లాంటి తారలను పలు కీలక పాత్రల కోసం చిత్ర బృందం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ప్రముఖ నటుడు వచ్చిచేరాడు.

 

ఆయనే విలక్షణ నటుడు మోహన్ బాబు. విశ్వనట చక్రవర్తి గా పేరొందిన ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు అలరించనున్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ లో మోహన్ బాబు పాల్గొననున్నారు. ఎస్పీ రంగరావు లాంటి గొప్ప నటుడి పాత్రకి మోహన్ బాబు అయితనే బాగా సరిపోతారని భావించి ఆయనను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పాలకొల్లులో జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?