చరణ్ పుట్టినరోజున స్టిల్ రిలీజ్ చేయనున్న రాజమౌళి ?

Published : Mar 24, 2018, 05:30 PM ISTUpdated : Mar 25, 2018, 05:27 PM IST
చరణ్ పుట్టినరోజున స్టిల్ రిలీజ్ చేయనున్న రాజమౌళి ?

సారాంశం

ఈ నెల 27న చరణ్ పుట్టిన రోజు 'రంగస్థలం'నుంచి ట్రైలర్  బోయపాటి మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ 

మెగా అభిమానులంతా ఈ నెల 27వ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున చరణ్ పుట్టినరోజు కావడమే అందుకు కారణం. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సారి మెగా అభిమానులను వరుస కానుకలు పలకరించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి' సమయంలో ఆర్టిస్టుల పుట్టిన రోజున వారికి సంబంధించిన స్టిల్స్ ను రాజమౌళి రిలీజ్ చేశారు.

అలాగే చరణ్ పుట్టినరోజున తమ మూవీకి సంబంధించి ఆయన స్టిల్ ను రాజమౌళి విడుదల చేయవచ్చని అంటున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన టెస్ట్ షూట్ నుంచి ఆ స్టిల్ రావొచ్చని చెబుతున్నారు. ఇక బోయపాటితో చరణ్ చేస్తోన్న మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ రావొచ్చని అంటున్నారు. 'సైరా' సినిమాకి చరణ్ నిర్మాత కనుక, ఆ మూవీ నుంచి కూడా ఒక స్పెషల్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక 'రంగస్థలం' నుంచి ఒక ట్రైలర్ రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మెగా అభిమానులకు ఇంతకి మించిన సందడేముంటుంది? 

PREV
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో