కన్నడ హీరో కోసం రాజమౌళి!

Published : Nov 21, 2018, 12:00 PM IST
కన్నడ హీరో కోసం రాజమౌళి!

సారాంశం

'RRR' సినిమా షూటింగ్ మొదలుకావడంతో రాజమౌళి బిజీ అయిపోయాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం పని చేయనున్నారు. తన సినిమా పనుల్లో పడిపోతే రాజమౌళి ఇతర వ్యవహారాల గురించి పెద్దగా పట్టించుకోరు. 

'RRR' సినిమా షూటింగ్ మొదలుకావడంతో రాజమౌళి బిజీ అయిపోయాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం పని చేయనున్నారు. తన సినిమా పనుల్లో పడిపోతే రాజమౌళి ఇతర వ్యవహారాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు ఓ కన్నడ హీరోకి తన వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు.

పాపులర్ కన్నడ హీరో యాష్ నటిస్తోన్న 'కెజిఎఫ్' సినిమాను కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి  తీసుకున్నారు. రాజమౌళి కుటుంబానికి సాయి కొర్రపాటి మంచి సన్నిహితుడు. రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సినిమాను నిర్మించింది కూడా సాయి కోర్రపాటే..

ఇప్పుడు అతడు రిలీజ్ చేయనున్న 'కెజిఎఫ్' సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి కూడా పాల్గొనున్నాడు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలై అత్యధిక వ్యూస్ ని సాధించింది. డిసంబర్ 21న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

దీనికి ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నారు. రాజమౌళితో పాటు అతడి కుటుంబం కూడా హాజరుకానుంది. రాజమౌళి ఇన్వాల్వ్ అయితే సినిమాకి క్రేజ్ రావడం ఖాయం. ఇప్పటికే కన్నడ నుండి వచ్చిన సుదీప్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరి హీరో యాష్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి! 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు