త్వరలోనే రకుల్ కి పెళ్లి!

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 11:06 AM IST
Highlights

దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్ని విషయాలతో త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? అనే సందేహాలు నెలకొన్నాయి. రకుల్ తల్లి ఆమెకి పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తోందట. 

దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్ని విషయాలతో త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? అనే సందేహాలు నెలకొన్నాయి.

రకుల్ తల్లి ఆమెకి పెళ్లి చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ''ఎప్పుడూ నటన, కెరీర్ అంటూ వృత్తి పరంగా బిజీగా ఉంటున్నావు.. నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు..?'' నీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి అంటూ ఈ మధ్య అమ్మ నన్ను నిలదీసింది. ఇదంతా పెళ్లి కోసమే అని నాకు అర్ధమైంది. సైలెంట్ గా ఉండిపోయాను.

నేను ఎందుకు సింగిల్ గా ఉన్నానో.. ఇప్పటికీ నాకు తెలియదని'' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మరిన్ని విషయాలను చెబుతూ.. ''రోజూ సాయంత్రం కాగానే నా స్నేహితుల్ని నాకొక మంచి పార్టనర్ ని చూడమని చెబితే మీరు నిర్లక్ష్యం చేస్తారా అంటూ తిడుతుంటాను. అమ్మ ఏమో పెళ్లి వయసు దాటిపోతుంది.. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటోంది.

ప్రేమ, పెళ్లి అంటే నాకు కూడా ఇష్టమే.. ముంబై, హైదరాబాద్ లో స్నేహితులందరికీ మంచి అబ్బాయిని చూడమని చెప్పాను. వారు అదే పనిలో ఉన్నారని అమ్మకి చెప్పాను'' అంటోంది రకుల్. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బట్టి త్వరలోనే రకుల్ కి ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తారని తెలుస్తోంది!

click me!