రాజమౌళి కొడుకు సైలెంట్ గా ఏం చేస్తున్నాడంటే..?

Published : Oct 27, 2018, 07:53 PM IST
రాజమౌళి కొడుకు సైలెంట్ గా ఏం చేస్తున్నాడంటే..?

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయకి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాలు పక్కన పెడితే కార్తికేయ కూడా తన తండ్రి సినిమాలకు పని చేస్తుంటాడు. 

దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయకి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాలు పక్కన పెడితే కార్తికేయ కూడా తన 
తండ్రి సినిమాలకు పని చేస్తుంటాడు.

బాహుబలి సినిమా కోసం తన వంతు బాధ్యతలు నిర్వర్తించాడు. మరోపక్క వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. ఇటీవలే నాగచైతన్య నటించిన 'యుద్ధం శరణం' సినిమాకు నిర్మాణ వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు ఆయనే స్వయంగా నిర్మాతగా మారిపోయాడు.

రాజమౌళి దగ్గర చాలా కాలంగా పనిచేస్తోన్న ఓ అసోసియేట్ ని దర్శకుడిగా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికి 'ఆకాశవాణి' అనే పేరుని కూడా ఫైనల్ చేశారట. సినిమా కాస్టింగ్ దగ్గర నుండి ప్రతీ పని చాలా సైలెంట్ గా జరిగేలా చూసుకుంటున్నారు.

సినిమా మొత్తం పూర్తయిన తరువాత వివరాలు బయటకి చెప్పాలని నిర్ణయించుకున్నారట. గతంలో దర్శకత్వశాఖలో పని చేసిన అనుభవంతో మంచి కథని ఎన్నుకొని సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి