రాజమౌళి ఓపెన్ గా చెప్పేశాడు

Published : Jan 21, 2017, 07:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రాజమౌళి ఓపెన్ గా చెప్పేశాడు

సారాంశం

ఏడాది కిందట బాలకృష్ణతో క్రిష్ సినిమా ఏమిట‌ని అంద‌రు అనుకున్నారు అంద‌రిలాగే   రాజమౌళి కూడా ఇలాగే ఆలోచించాడట  కానీ సినిమా చూశాక త‌న అభిప్రాయం మార్చుకున్న రాజ‌మౌళి  

 
మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఇలాగే ఆలోచించాడట. క్రిష్-బాలయ్యల కాంబినేషన్ బాగోదని అనుకున్నాడట. అసలు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారనగానే అది ఫ్లాప్ అని కూడా ఫిక్సయిపోయినట్లు రాజమౌళి ఓపెన్ గా చెప్పేశాడు.‘‘బాలయ్య గారి వందో సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడనగానే చాలామంది లాగే నాకు కూడా ఏదోలా అనిపించింది.

 బాలయ్య లాంటి మాస్ హీరోను క్రిష్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఎలా చూపిస్తాడో అని సందేహించాను. ఈ సినిమా మీద అనుమానాలు నెలకొన్నాయి. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడమేంటి.. వీళ్లది బ్యాడ్ కాంబినేషన్ అని ఫీలయ్యాను. ఐతే కొన్నాళ్ల తర్వాత సాయి కొర్రపాటి గారు నన్ను కలిసి ఈ సినిమా గురించి చెప్పారు.

 క్రిష్ కథ చెప్పాడని.. చాలా బాగుందని.. అందులో రకరకాల ఎమోషన్లు ఉన్నాయని.. సినిమా ఆడేస్తుందేమో అని సందేహంగా ఉందని అన్నాడు. ట్రైలర్ చూశాక నా అభిప్రాయం కూడా మారింది. సినిమా చూశాక అద్భుతంగా అనిపించింది. నాతో పాటు అందరి అభిప్రాయం తప్పని క్రిష్ నిరూపించాడు’’ అని క్రిష్ తో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో రాజమౌళి అన్నాడు.

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?