వణికే చలిని కూడా లెక్కచేయకుండా.. మొక్కవోని దీక్షతో షూటింగ్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌..

Published : Nov 17, 2020, 12:20 PM IST
వణికే చలిని కూడా లెక్కచేయకుండా.. మొక్కవోని దీక్షతో షూటింగ్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌..

సారాంశం

అనుకున్న టైమ్‌ లోనే `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ పూర్తి చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లేట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నారు రాజమౌళి టీమ్‌. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్‌ జరుపుతున్నారు.

తెలుగులో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కరోనా లాక్‌డౌన్‌ మరింతగా ఇబ్బంది పెట్టింది. దాదాపు ఎనిమిది నెలలు షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ లోపు షూటింగ్‌ జరిగితే ఇప్పటికే షూటింగ్‌ పూర్తయ్యేది. 

లాక్‌ డౌన్‌ మరోసారి సినిమాని వాయిదా వేసింది. ఇక అనుకున్న టైమ్‌ లోనే పూర్తి చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లేట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నారు రాజమౌళి టీమ్‌. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్‌ జరుపుతున్నారు. వణికే చలిని కూడా లెక్క చేయకుండా రాత్రి సమయాల్లో కూడా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ చిన్న వీడియోని పంచుకుంది టీమ్‌. ఇందులో చలికి వణుకుతున్నా కూడా షూటింగ్‌ లో పాల్గొన్నట్టు తెలిపారు. 

ఇందులో కెమెరామెన్‌, రాజమౌళితోపాటు ఎన్టీఆర్‌ కూడా ఉన్నారు. వీడియో చివర్లో ఆయన తళుక్కున మెరిశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?